త్వరలో చలో ఢిల్లీ
టీడీపీ దాడులపై ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ సీపీ ఉద్యమం
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం
నిందితులను శిక్షించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ అగ్ర నాయకులు
పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ సంస్మరణ సభ
నివాళులర్పించిన రాష్ట్ర నాయకులు
చంద్రబాబు దృష్టిలో దళిత ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదు
అంబేద్కర్ విగ్రహంపై దాడితో
దాడులతో వైఎస్సార్‌సీపీ నుంచి దళితులను వేరు చేసే కుట్రలు
అభివృద్ధి చేయడం చేతకాక దాడులతో దారికి తెచ్చుకునే ఎత్తుగడ
చంద్రబాబు కుట్రలపై వైఎస్సార్ సీపీ నాయకుల ధ్వజం
మందా సాల్మన్ హత్యపై
నరసరావుపేట: చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదని, అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ సీపీకి అండగా ఉన్న దళితులపై దాడులు చేసి వారిని పార్టీకి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని పార్టీ అగ్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం మీద దాడితోనే దీనికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. టీడీపీ గూండాల దాడిలో మందా సాల్మన్ దారుణ హత్యకు గురై పది రోజులైన సందర్భంగా ఆదివారం నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాల్మన్ సంస్మరణలో కూటమి ప్రభుత్వంపై నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనంతరం నాయకులంతా భారీ ర్యాలీగా పిన్నెల్లి గ్రామానికి వెళ్లి మందా సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సాల్మన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చేతనైతే వైఎస్ జగన్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి పల్నాడు ప్రజల మనసు గెలుచుకోవాలని సవాల్ విసిరారు. అభివృద్ధి చేతకాక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే వారే ఎప్పటికీ అధికారంలో ఉండొచ్చనే పగటి కలలు మానుకోవాలని అన్నారు. వారి వేధింపులను లెక్కచేయకుండా పార్టీ కోసం పోరాడుతున్న కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీ ఆధ్వరంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్‌లో టీడీపీపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పాల్గొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే..
దళితులపై దాడులకు టీడీపీ నాయకుల శ్రీకారం


