గుంటూరు
న్యూస్‌రీల్
గణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరులో నామమాత్రంగా ఉత్సవాలు కనిపించని శకటాలు, స్టాళ్లు తాగునీరు కూడా లేక చిన్నారులకు అవస్థలు
శకటాలు, స్టాళ్లు ఏవీ?
బాలలకు కష్టాలు
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 547.30 అడుగులకు చేరింది. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 7,601 క్యూసెక్కులు వదిలారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు వెస్ట్: జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అపూర్వ త్యాగాలు, సేవలు చిరస్మరణీయం అన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి పది ముఖ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు, పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారం చేస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ క్లినిక్ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చి భూ సంబంధిత సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కృషి జరుగుతోందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జలవనరుల శాఖ ద్వారా ఈ ఖరీఫ్ సీజనులో 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు 24 టీఎంసీల సాగునీరు విడుదల చేశామని తెలిపారు. గుంటూరు చానెల్ పొడిగింపు పనులకు రూ.274.53 కోట్ల పరిపాలన ఆమోదం లభించి, భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. డీసీహెచ్‌ఎస్ సెకండరీ హెల్త్ ద్వారా జిల్లా వైద్యశాలలో రూ.47 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుందని చెప్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జాతీయ సరస్ మేళా ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు జాతీయ స్థాయి మార్కెట్ లభించి సుమారుగా రూ.25 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుత జనాభాకు అవసరమైన 72 ఎంఎల్‌డీ సమగ్ర త్రాగునీటి సరఫరా కోసం రూ.393.74 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,234.73 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
ఏర్పాట్లు అంతంతే
గణతంత్ర దినోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. సోమవారం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కనీస ఏర్పాట్లు చేయలేదు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధిక ప్రాధాన్యతనిచ్చి జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన వేడుకలను విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కార్యక్రమం 11.30 గంటలకు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. జిల్లా అధికారులతోపాటు శాసన సభ్యులు గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులతోపాటు టీడీపీ నాయకులు సమయానికే వచ్చినా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా 12.35కు వేదిక వద్దకు చేరుకున్నారు. వెంటనే జెండావిష్కరణ చేశారు. కలెక్టర్ మాట్లాడాల్సిన ప్రసంగం జెండావిష్కరణకు కొద్ది నిమిషాల ముందు మాత్రమే సిద్ధమైంది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. కలెక్టర్ ప్రసంగాన్ని బుక్‌లెట్ రూపంలో ముద్రించి కార్యక్రమం ప్రారంభంలోనే అధికారులతో పాటు మీడియాకు అందివ్వడం పరిపాటి. అధికారుల మధ్య సమన్వయలోపమే దీనికి కారణం.
జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్
తమీమ్ అన్సారియా
7
ప్రతి సంవత్సరం ప్రభుత్వ శాఖలు శకటాలను తయారు చేసి ప్రదర్శించేవి. ప్రభుత్వ అఽభివృద్ధిని ఇవి కళ్లకు కట్టేవి. ఉత్తమమైన తొలి మూడు శకటాలను ప్రకటించడం పరిపాటి. వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేసేవారు. ఈ సారి శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయలేదు. కారణాలు మాత్రం ఎవ్వరికీ తెలీదు. అమరావతి రాజధానిలో వేడుకలు జరిగినందున ఇక్కడ చేయలేదని అధికారులు అంటున్నారు.
వివిధ పాఠశాలల నిర్వాహకులు దాదాపు నెల రోజల నుంచి తమ విద్యార్థులతో వివిధ అంశాల్లో సాధన చేయించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పోలీస్ పెరేడ్ మైదానానికి విద్యార్థులు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాతే కార్యక్రమం ప్రారంభం కావడంతో ఇబ్బంది పడ్డారు. తాగునీరు కూడా అందుబాటులో లేదు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు వేదిక నుంచి నిష్క్రమించారు. పలువురు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
గణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


