ఘనంగా రథసప్తమి వేడుకలు
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో ఆదివారం రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారిని ఊరేగించారు. మూడవ వాహనమైన గరుడ వాహనంపై స్వామివారు పూజలు అందుకున్నారు. వాహన కై ంకర్యపరులుగా మునగపాటి నాగయ్య, హైమావతి దంపతుల కుమారులు, కుటుంబ సభ్యులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు, మరికొంత మంది కై ంకర్యంతో పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విజయకీలాద్రిపై తాడేపల్లిలోని విజయకీలాద్రిపై రథసప్తమి వేడుకలను త్రిదండి చిన్నజీయర్‌స్వామి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక వాహనంలో అలంకరించి కొండపై ఊరేగింపు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నజీయర్‌స్వామి రథసప్తమి విశిష్టతను వివరించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఘనంగా రథసప్తమి వేడుకలు


