గురజాలలో యరపతినేని గూండారాజ్యం
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో సాల్మన్ హత్యతో వచ్చిన ప్రజావ్యతిరేకత ద్వారా చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే అర్థమైపోయింది. ఈ హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారిని సహకరించిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. నిందితులను చట్టపరంగా శిక్షించే దాకా న్యాయస్థానాల్లో పోరాడతాం. గురజాలలో గూండా రాజ్యం నడుపుతున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కి ప్రజాస్వామ్యం బలం చూపిస్తాం. దాడిచేసి చంపారని ఫోన్ చేసిన బాధితులతో గ్రామంలోకి ఎందుకొచ్చారని ప్రశ్నించిన సీఐ భాస్కరరావుని న్యాయస్థానాల ద్వారా శిక్ష పడేలా చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణలో చూపించిన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించకతప్పదు.
– కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే


