సీబీఐతో విచారణ జరిపించాలి
అమాయక దళిత కుటుంబంపై దాడి చేసి చంపితే ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఫిర్యాదు చేయడానికి వచ్చినా డీజీపీ కనీసం కలవడానికి ఇష్టపడలేదు. దళితుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి అంత లెక్కలేనితనం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా ఆయన పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, దళిత మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి. వైఎస్సార్ సీపీ హయాంలో ఒక మహిళను దారుణంగా చంపితే దళిత చట్టాల ప్రకారం వారిని ప్రభుత్వం ఆదుకుంది. కానీ చంద్రబాబు స్పందించకపోవడం దుర్మార్గం.
– మేరుగ నాగార్జున, మాజీ మంత్రి


