టీడీపీ సేవలో తరిస్తున్న ఉద్యోగులు
పొన్నూరు: ఎన్నికల తరువాత టీడీపీ నాయకుల సిపార్సులతో పోస్టింగులు దక్కించుకున్న కొందరు అధికారులు వాళ్ల ఆడుగులకు మడుగులొత్తుతున్నారు. తాము కావాలనుకున్న చోట కు బదిలీ చేయించారనే కారణంతో టీడీపీ నాయకులపై వీర విధేయత ప్రదర్శిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను తామే ముందుండి నడిపిస్తున్నారు. టీడీపీ నిర్వహించే ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. శనివారం పొన్నూరులో టీడీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పాల్గొని అన్నదానం చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్ పాల్గొనడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చింతలపూడి మురళి ఆరోపించారు. ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటేనే ఉద్యోగులకు ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందని అన్నారు.
లక్ష్మీపురం: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొందరు ఉద్యోగుల వ్యవహార శైలిపై విమర్శలు


