
నిజమైన హీరోలు
ప్రజలకు సాయం అందించినవారే
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు
ప్రత్తిపాడు: ప్రజలకు సాయం అందించనప్పుడే నిజమైన హీరోలుగా గుర్తింపు వస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రత్తిపాడు మండలం నాగులపాడు బొడ్రాయి సెంటరులో మంగళవారం మాజీ సర్పంచ్ ఆళ్ల రాఘవయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ లావు నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచి పనులు చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. దేశంలో ఎంతో మంది పేదలు ఉన్నారని, మన కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు, సమాజం గురించి ఆలోచించాలన్నారు. 37 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి రాఘవయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, నల్లమడ రైతు సంఘం నాయకుడు డాక్టర్ కొల్లా రాజమోహన్, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, ఆళ్ల విజయ్‌కుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
●స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాట్స్ పూర్వ అధ్యక్షుడు, పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం సహకారంతో రూ.13 లక్షలతో నిర్మించిన నూతి సుబ్బారావు – సీతాదేవి డైనింగ్ హాల్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.