
ఉచితానికి బస్సులేవీ!
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025
బస్సుల కొరత.. హామీకి కోత
● మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సవాలక్ష ఆంక్షలు ● రాష్ట్రమంతా తిరగొచ్చని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కూటమి నేతలు ● తాజాగా జిల్లావరకే నంటూ సన్నాయి నొక్కులు ● పల్లె వెలుగు, అల్ట్రాడీలక్స్‌లలో మాత్రమే ఉచితమంటూ లీకులు ● రీజియన్ పరిధిలో 215 పల్లె వెలుగు, 41 అల్ట్రాడీలక్స్ బస్సులు మాత్రమే.. ● కనీస మార్గదర్శకాలు జారీచేయని రాష్ట్ర ప్రభుత్వం
మాకు ఓటేస్తే రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా తిరగొచ్చంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి రావడమే ఆలస్యం హాయిగా బస్సుల్లో ఇష్టమెచ్చిన చోటకు వెళ్లి రావొచ్చంటూ ఇంటింటికి తిరిగి హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీ అమలుపై
ప్రశ్నిస్తే.. అదిగో, ఇదిగో అంటూ ఏడాది కాలం దాటించారు.. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి అంటున్నారు. అదీనూ కొన్ని బస్సుల్లోనే.. కొన్ని ప్రాంతాలకే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తీరా కాలంతీరి, కండీషన్
అంతంతమాత్రంగా ఉండే
అరకొర బస్సులతోనే సరిపెట్టుకోమంటుండంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కూటమి సర్కారు మరో మోసానికి తెరదీస్తోంది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ ఎన్నికల సమయంలో ఇంటింటా ఊదరగొట్టిన కూటమి నేతలు.. తాజాగా జిల్లా వరకు ప్రయాణాలకు మాత్రమే ఉచితమంటూ .. అదీనూ పల్లెవెలుగు, అల్ట్రాడీలక్స్‌లలోనే నంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుండడం మహిళా లోకాన్ని కలవరపెడుతోంది. ఇరత రాష్ట్రాల్లో దాదాపు అన్ని బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తుండగా.. మన రాష్ట్రంలోనే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కూటమి నేతలు ప్రకటిస్తున్నారు.
ప్రతిరోజూ
రూ.కోటి ఆదాయం
జిల్లాలో గుంటూరు 1, 2 డిపోలు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలోని ఐదు డిపోలతో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి అధికంగా మహిళలు ప్రయాణం చేస్తుంటారు. ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.కోటి వరకు ఉంటుంది. పండగలు, ఇతరత్రా రద్దీ రోజుల్లో రూ 1.25కోట్లు ఆదాయం సమకూరుతుంది. తాజాగా ఉచిత ప్రయాణంలో భాగంగా ఆర్టీసీ ప్రతిరోజు రూ 50 లక్షలకుపైగా ఆదాయం కోల్పోనుంది.
అందుబాటులో ఉన్న బస్సులు 215
(పల్లెవెలుగు)
న్యూస్‌రీల్
ఆర్టీసీ ఆదాయం
రూ.కోటి
(రోజుకు)
జిల్లావ్యాప్తంగా మహిళలు
10 లక్షల
మంది

ఉచితానికి బస్సులేవీ!

ఉచితానికి బస్సులేవీ!

ఉచితానికి బస్సులేవీ!

ఉచితానికి బస్సులేవీ!

ఉచితానికి బస్సులేవీ!