
‘పల్లె వెలుగులు’ లేవు
గుంటూరు రీజియన్ పరిధిలో మొత్తం 412 బస్సులు ఉన్నాయి. అందులో 97 హైర్ బస్సులు, 215 పల్లె వెలుగు, 41 అల్ట్రాడీలక్స్, 44 సూపర్ లగ్జరీ, 12 ఇంద్ర, 4 అమరావతి స్కానియా ఉన్నాయి. కూటమి గద్దెనెక్కిన తరువాత 2024 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అని ఊదరగొట్టారు. ఆ తరువాత దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ ఏడాది కాలయాపన చేశారు. నానాటికీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోవటంతో మరోసారి ఉచిత బస్సును తెరపైకి తెచ్చారు. మంత్రులు సైతం దీనిపై తలోమాట మాట్లాడుతుండడంపై అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.