
సాక్షి, తాడేపల్లి: GSLV F16 విజయవంతంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. NISAR శాటిలైట్‌ని సక్సెస్ ఫుల్‌గా కక్ష్యలోకి ప్రవేశ పెట్టటంపై ఇస్రోని వైఎస్ జగన్ అభినందించారు. ఈ గొప్ప విజయంలో పాల్గొన్న సైంటిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహం నిసార్ శాటిలైట్ GSLV-F16 ప్రయోగం విజయవంతమైంది. జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు ఇస్రో సైంటిస్టులు.
Congratulations to @isro on the successful launch of #GSLVF16 and the flawless delivery of #NISAR into orbit.
Best wishes to all the scientists and teams involved in this remarkable achievement.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 30, 2025
98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్‌ను ప్రవేశపెట్టారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు... దాదాపు 11 వేల 200 కోట్ల రూపాయలతో వ్యయంతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.