గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

Jun 22 2025 3:46 AM | Updated on Jun 22 2025 3:46 AM

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

తల్లీకూతుళ్లకు స్వల్ప గాయాలు

పెదకాకాని: గ్యాస్‌ సిలిండర్‌ పేలి తల్లీకూతుళ్లకు గాయాలైన సంఘటన శనివారం మండలంలోని తక్కెళ్లపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాటా సామ్రాజ్యం కుమార్తెలు భూలక్ష్మి, కృష్ణకుమారి ఇటీవల పుట్టింటికి వచ్చారు. వారితో పాటు భూలక్ష్మి కుమార్తె అలేఖ్య కూడా వచ్చింది. ఆమె ప్రస్తుతం గర్భిణి. ఏడాది పాప ఉంది. అంతా కలసి పిండివంటలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి పొగలు రావడంతో సామ్రాజ్యం, భూలక్ష్మి, కృష్ణకుమారి బయటకు పరుగులు తీశారు. బెడ్‌రూంలో ఏడాది పాప ఉండటంతో అలేఖ్య లోపలకు వెళ్లి తలుపులు వేసుకుంది. బయటకు వెళ్లిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి, అలేఖ్య, ఆమె కుమార్తెను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. కొద్దిసేపటికే సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలడంతో సామ్రాజ్యం, ఆమె కుమార్తె భూలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement