Section 124A: 124–ఏ సెక్షనే దేశానికి రక్ష!

Section 124A Should Be Continued: Tripuraneni Hanuman Chowdary - Sakshi

‘‘ఇండియా తేరే తుకడే తుకడే కరేంగే’’ అని ఊరేగింపులలో బహిరంగంగా అరవడం దేశద్రోహం కాకపోతే, మరేమిటి? భారత పార్లమెంటుపై హంతక దాడికి పాల్పడిన ఉగ్ర వాదులనూ, వారిని ప్రేరేపించిన వారినీ, వారికి శిక్షణ ఇచ్చిన వారినీ హీరోలుగా కీర్తించడం దేశద్రోహం అవ్వక మరే మౌతుంది? ప్రభుత్వాన్ని పడగొట్టి శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించే లక్ష్యంతో సొంత బలగాలను పెంచుకోవడం, సైన్యం దేశరక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వారిపై దొంగ దాడులకు పాల్పడటం దేశద్రోహం కాకపోతే మరింకేమిటి? 

ముస్లింలు సురక్షితంగా ఉండేందుకూ, వారికి స్వయం పాలన ఒనగూడేందుకూ భారతదేశాన్ని మరోసారి విభజించి మొఘలి స్థాన్‌ను సృష్టించాలని ఒక ప్రొఫెసర్‌ రాస్తే అది దేశద్రోహం కాకుండా ఎలా ఉంటుంది? హత్య, అత్యాచారం, దోపిడీ అనేవి 150 ఏళ్లకు పైగా ఉన్న భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేటికీ శిక్షార్హమే అయినప్పుడు ఆ కాలం నాటిదే అయిన 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి? (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?)

వలస పాలకుల కాలంలో 150 ఏళ్ల క్రితం నేరాలుగా పరి గణన పొందినవి నేడెలా నేరం కాకుండా పోతాయి? భారతదేశంలో దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక, విదేశీ ప్రేరక... వ్యక్తులూ, సిద్ధాంత కర్తలూ, కార్యకర్తలూ ఉన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛా భారతాన్ని వారి నుంచి రక్షించడానికి దేశద్రోహ ప్రసంగాలను, రచనలను, ప్రచారాలను, చర్యలను గుర్తించాలి, గమనించాలి, శిక్షించాలి. అందుకోసం రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్‌ 124–ఏను కొనసాగించాలి. న్యాయబద్ధంగా నిందితులను విచారించాలి. దోషులకు శిక్షలు విధించాలి. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు దృఢ వైఖరి సరైనది, ప్రశంసనీయమైనది. (క్లిక్‌:  దేశద్రోహం కేసు నిందితుడిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా)

– డాక్టర్‌ టి. హనుమాన్‌ చౌదరి; చైర్మన్, ప్రజ్ఞాభారతి

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top