Bhima Koregaon: జైలులో మగ్గుతూనే ఉన్నారు!

Bhima Koregaon Shaurya Din: Elgaar Parishad Case - Sakshi

‘భీమాకోరేగాం యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. ఆ యుద్ధం జరిగి 200 సంవత్సరాలైన సందర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్ర వర్ణాలవారు దాడి చేశారు...’
‘స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి’ అని సాయిని నరేందర్‌ ‘సాక్షి’ దినపత్రికలో (1 జన వరి, 2022) రాసిన విశ్లేషణలో, ఆ దాడి జరిగిన వధూభద్రక్‌లో శంభాజీ మహరాజ్‌కు సమాధి నిర్మించిన దళితుని సమాధిని 2018 జనవరి 1న అగ్రవర్ణాలు కూల్చేసిన విషయాన్ని ప్రస్తావించ లేదు. భీమాకోరేగాం శౌర్యస్థలికి, ఒక రోజు ముందు (డిసెంబర్‌ 31, 2017) జరిగిన ‘ఎల్గార్‌ పరిషత్‌’ (శనివార్‌ వాడ, పుణే)కు ముంబై నుంచి దళితులను, అణచబడిన కులాలవారిని తరలించిన ఆరోపణపై 8 మంది తెలంగాణకు చెందిన రిలయన్స్‌ కంపెనీ కార్మికులను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ అరెస్టు చేసిన ప్రస్తావనా ఆ వ్యాసంలో లేదు. ఈ అరెస్టు సందర్భంగా ఏటీఎస్‌ వాళ్లు చేసిన మానసిక చిత్రహింసలు భరించలేక తెలుగు, మరాఠీ సాహిత్యవేత్త మచ్చ ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఎనమండుగురు యువకులు ఉద్యోగాలు కోల్పోయి రెండేళ్లు జైల్లో ఉండి విడుదలయ్యారు.

భీమాకోరేగాం అమరుల 200వ సంస్మరణ సభ నిర్వహించిన 280 సంస్థల ఎల్గార్‌ పరిషత్‌ సమావేశం (31 డిసెంబర్‌ 2017–శనివార్‌ పేట, పుణే)లో ‘నయీ పీష్వాయీ నహీ చలేగీ’ అని రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేయించిన సాంస్కృ తిక కళాకారుడు, రిపబ్లిక్‌ పాంథర్స్‌ సంస్థాపకుడు సుధీర్‌ ధావ్లే, కబీర్‌ కళామంచ్‌ కళాకారులు రమేశ్, సాగర్, జ్యోతి ఇంకా జైల్లో మగ్గుతూనే ఉన్నారు. (చదవండి: ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్‌)

ఈ కేసును 2020 జనవరి నుంచి కేంద్ర ఎన్‌ఐఏ కోర్టు– ముంబై చేపట్టింది కనుక, వీళ్లతో పాటు అంబేడ్కరిస్టు మార్క్సిస్టు మేధావి ఆనంద్‌ టేల్‌టుంబ్డే, ప్రొఫెసర్‌ సాయిబాబా, ఆయన సహచరులపై గడ్చిరోలీ కుట్ర కేసును వాదించిన ప్రముఖ క్రిమినల్‌ లాయర్, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్స్‌ (ఐఏపీఎల్‌) కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్, ‘కలర్స్‌ ఆఫ్‌ కేజ్‌’ (సంకెళ్ల సవ్వడి) రచయిత, ఐఏపీఎల్‌ కోశాధికారి అరుణ్‌ ఫెరీరా, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, రీసెర్చ్‌ స్కాలర్‌ రోనా విల్సన్, ప్రొ. జీఎన్‌ సాయిబాబా డిఫెన్స్‌ కమిటీకి సహకరించిన ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ హనీబాబు, ప్రొఫెసర్‌ షోమా సేన్, వర్ణన్‌ గొన్‌జాల్వెజ్, మహేశ్‌ రౌత్, గౌతమ్‌ నవ్‌లఖా ఇంకా జైళ్లలో మగ్గుతూనే ఉన్నారు. కస్టోడియల్‌ మరణానికి గురయిన స్టాన్‌ స్వామి గురించి ఇక చెప్పేదేముంది? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!)

– సాథీ, హైదరాబాద్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top