సముద్రంలో తేలియాడే నగరం.. పంటలు కూడా.. ఎక్కడో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా సాగరతీరాల్లో ఉన్న నగరాలు తక్కువేమీ కాదు గాని, సాగరంలోని అలలపై తేలియాడే నగరం ఎక్కడైనా ఉందంటే అది వింతే! అలాంటి వింతనే దక్షిణ కొరియా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలి తేలియాడే నగరాన్ని బ్యూసన్ సాగరతీరానికి ఆవల సముద్రం అలలపై నిర్మించింది. ‘ఓషియానిక్స్’ పేరిట పూర్తి జనావాసానికి అనుకూలమైన నగరాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సహకారంతో నిర్మించింది.
త్వరలోనే ఇది పర్యాటకుల రాకపోకలకు, నౌకల రవాణాలకు అనువుగా సిద్ధం కానుంది. సముద్రంలో తేలియాడే ఈ నగరంలో రకరకాల ఆహార పంటలను పండిస్తుండటం, పండ్ల తోటలను పెంచుతుండటం కూడా విశేషం.