
’ నేడు ఫుడ్ సేఫ్టీ డే
World Food Safety Day 2025 సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్య అంతా వంట గది నుంచే మొదలవుతుంది.
ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలంటే..? ప్రతి యేటా సురక్షితం కాని ఆహారం తినడం వల్ల 60 కోట్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. నేడు ఫుడ్ సేఫ్టీ దినోత్సవ సందర్భంగా కొన్ని సురక్షితమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం...
చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వాడిన పాత్రలను, వాడాలనుకున్న పాత్రలను తప్పనిసరిగా కడిగాకనే తిరిగి ఉపయోగించాలి.
ముడి పదార్థాలను, వండిన పదార్థాలను వేరుగా ఉంచడం వల్ల క్రాస్–కాలుష్యాన్ని నివారించ వచ్చు.
పూర్తిగా ఉడికించాలి. ముఖ్యంగా మాంసం, మాంసాహారం, సముద్రపు ఆహారం.. బాగా ఉడికించిన తర్వాతనే తీసుకోవాలి.
ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేయాలి. అతి చల్లని, అతి వేడి పదార్థాలను తీసుకోవడం నివారించాలి.
సురక్షితమైన నీరు, ముడి పదార్థాలను ఉపయోగించాలి. పదార్థాల తాజాదనాన్ని చెక్ చేసి, తీసుకోవాలి. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో చాలా ముఖ్యం.
ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు
ఆహారాన్ని శుభ్రంగా వుంచుకోవడం అన్నది 200 కంటే ఎక్కువ ఆహార సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు.
తాజా ఆహారం వల్ల ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించవచ్చు.
సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఇంట్లో/రెస్టారెంట్లలో ఆహారాన్ని ఎక్కడ తీసుకున్నా ఆరోగ్యకరమైన దాని పట్ల తప్పక దృష్టి పెట్టాలి.