బొటాక్స్‌ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్‌ కోసం వాడితే..!

Woman Paralysed After Taking Botox Injections For Migraines - Sakshi

బొటాక్స్‌ ఇంజక్షన్‌ను ముఖంపై ముడతలు తగ్గించడానికి తీసుకుంటారు. ఇదిచర్మం ముడతలు పడడానికి కారణమైన ధమనులను ఇది నాశనం చేస్తుంది. అలాంటి బొటాక్స్‌ ఇంజెక్షన్‌ వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. ఇక్కడొక మహిళ మైగ్రేన్‌ కోసం బొటాక్స్‌ ఇంజెక్షన్‌ తీసుకోవడమే శాపమై ప్రాణాంతకంగా మారింది.

అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మైగ్రేన్‌ సమస్య నుంచి ఉపశమనం కోసం బొటాక్స్‌ ఇంజెక్షన్‌ తీసుకుంది. అలా తీసుకుందో లేదో కొద్ది క్షణాల్లోనే మరణం అంచులకు చేరువయ్యేలా ఆమె పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. తీవ్ర పక్షవాతంతో కనీసం తల కూడా పైకెత్తలేని స్థితిలో అచేతనంగా మారిపోయింది. తన నోటిలోని లాలాజలమే ఆమెను ఉక్కిబిక్కిరి చేసేలా ఉంది ఆమె స్థితి. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. ఈ బొటాక్స్ ఇంజెక్షన్‌ కారణంగా మెడ కండరాల పక్షవాతానికి గురయ్యింది. దీంతో కనీసం చూడలేకపోవడ, మాట్లాడలేకపోవడం, మింగకపోవడం, తలను కదపలేకపోవడం తదితర ఘెరమైన సమస్యలను ఫేస్‌ చేసింది.

చెప్పాలంటే చనిపోతానేమో అనుకుంది. ఈ బొటాక్స్‌ ఇంజెక్షన్‌ అధికమవ్వడం వల్ల లేక మరేదైన కారణమో గానీ, ఇది ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపి మెడ, ముఖం భాగాల్లోని నరాల నాశనం చేసింది. ఆస్పత్రిలో చేరి కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందింది. ఆ తర్వాత 18 రోజులకు డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆమె  రక్తనాళాల గోడలు, కీళ్లు, చర్మంలోని బంధన కణజాలాన్ని ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత అయిన ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు.

అయితే ఆమె ప్రస్తుతం బెటర్‌గా కోలుకుంటుందన్నారు. కానీ ఆమె సక్రమంగా తినడానికి, తాగడానికి, నడవడానికి, మాట్లాడటానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని వైద్యులు చెప్పారు. ఈ బొటాక్స్‌తో చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు గానీ, ఈ మహిళలా ఇంతలా తీవ్ర పరిస్థితిని ఎదుర్కొనలేదని అన్నారు. అందుకే ఆమె కేసుపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. కాగా, సదరు బాధిత మహిళ తాను ఎదుర్కొన్న ఈ భయానక పరిస్థితిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా అయ్యింది.

బొటాక్స్‌ ప్రమాదకరమా?

  • బోట్యులస్' అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థమే ఈ బోటాక్స్. ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా 18వ శతాబ్దంలో పాడైపోయిన సాసేజ్‌ల మీద కనుగొన్నారు. లాటిన్‌లో సాసేజ్‌ను బోట్యులస్ అంటారు.
  • ఇది బోట్యులైనమ్ టాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం.
  • కొన్ని చెమ్చాల బోట్యులైనమ్ టాక్సిన్ ఒక దేశ జనాభానే చంపగలదు.
  • కొన్ని కిలోల బొటాక్స్ ఈ భూమి మీద నివసిస్తున్న సమస్త జనాభానూ సర్వనాశనం చేయగలదు.
  • బోట్యులైనమ్ టాక్సిన్ మనిషి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్లో న్యూరోటాక్సిన్ ఉంటుంది. అంటే ఇది నరాల్లోకి ప్రవేశించి, కీలకమైన ప్రొటీన్లను నాశనం చేస్తుంది. నరాలకు, కండరాలకు మధ్య సంబంధాన్ని హరిస్తుంది. కొత్తగా నరాల చివర్లు పెరిగితే తప్ప మళ్లీ కండరాల పనితీరు బాగుపడదు. దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది.

దేనికి ఉపయోగిస్తారంటే..
బొటాక్స్‌ను సౌందర్య సాధనంగానే కాక అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా వాడతారు. మెల్లకన్ను తొలగించేందుకు, మైగ్రిన్స్ (తీవ్రమైన తలనొప్పులు) తగ్గించేందుకు, అధిక చెమట నుంచి విముక్తి కలిగించేందుకు, మూత్రాశయ ఇబ్బందులను తొలగించేందుకు కూడా వాడతారు. చెప్పాలంటే దాదాపు 20 కన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలకు చికిత్సలో భాగంగా బోటాక్స్ వాడతారని నిపుణులు చెబుతున్నారు.

(చదవండి: ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్‌ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..)

Election 2024

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top