బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్‌ చేస్తుండగా..అంతలోనే.. | Woman Being Swept Away By Massive Waves In Russias Sochi | Sakshi
Sakshi News home page

బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్‌ చేస్తుండగా..అంతలోనే..

Published Wed, Jun 19 2024 5:57 PM | Last Updated on Wed, Jun 19 2024 7:20 PM

Woman Being Swept Away By Massive Waves In Russias Sochi

కొందరూ ప్రేమికులు ప్రమాదకరమైన చోట్ల చేసే సరదా పనులు జీవితాలను కోల్పోయేలా చేస్తాయి. ముఖ్యంగా రైల్వే ఫ్లాట్‌పాంలపై, బైక్‌లపై చేసే పిచ్చి పనులతో ప్రాణాలు కోల్పోయిన వారెందరో. ఏ క్షణంలో మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించను కూడా ఊహించం. అలాంటిది ఇలాంటి డేంజరస్‌ ప్రదేశాల్లో మనమే కాస్త జాగ్రత్తగా మసులుకోవాలి. లేదంటే ఈ ప్రేమ జంటలా కథలా విషాదంగా ముగిస్తుంది.

ఏం జరిగిందంటే..రష్యాలోని సోచీలో బీచ్‌ వద్ద సరదాగా జంట ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నడుస్తున్నారు. అబ్బాయి వద్దన్న పర్లేదు అంటూ కాస్త లోపలికి తీసుకువచ్చింది. వెనుక నుంచి అలల వేగం ఎక్కువయ్యింది. కానీ ఇదంత గమనించకుండా తమ అల్లరిలో మునిగిపోయిన జంట మీదకు అమాంతం పెద్ద కెరటం వచ్చింది. అంతే ఒక్కసారిగా ఆ అమ్మాయి అలల ధాటికి లోపలికి వెళ్లిపోగా..ఏదోల ఒడ్డుకు వచ్చాడు ప్రియుడు. పాపం అతడు తన ప్రియురాలిని రక్షించుకుందామని ఏదోలా ప్రయత్నించినా..అప్పటికే ఆలస్యం అవ్వడం తోపాటు ఒకదానివెంట ఒకటి వేగంగా అలలు వస్తూ..ఆమెను మరింత లోతుగా తీసుకుపోయాయి. 

దీంతో అతడు ఏం చేయ్యలేని సిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రివేరా బీచ్ నుంచి మామైకా మైక్రోడిస్ట్రిక్ట్ వరకు బాధితురాలి కోసం గాలించడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇలాంటి చోట్ల జాగ్రత్తగానే ఉండాలని, మరింత లోపలికి వెళ్లే ప్రయత్నం అస్సలు చెయ్యకూడదని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ ఈత రానప్పుడూ ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టొదని చివాట్లు పెడుతూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..! ఆ మందుల ప్రభావంతో..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement