మామ్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..! జస్ట్‌ 11 నెలల్లో 32 కిలోలు.. | Weight Loss Tips: C-section mom reveals how she lost 32 kg in 11 months | Sakshi
Sakshi News home page

మామ్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..! జస్ట్‌ 11 నెలల్లో 32 కిలోలు..

Jun 26 2026 10:18 AM | Updated on Jun 26 2026 11:49 AM

Weight Loss Tips: C-section mom reveals how she lost 32 kg in 11 months

ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్‌ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది కూడా జస్ట్‌ 11 నెలల్లోనే. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.

కంటెంట్‌ క్రియేటర్‌  దీప్తి హర్షనా ఇద్దరు పిల్లల తల్లి. అదులోనూ సీసెక్షన్‌ చేయించుకుందామె. అలాంటప్పుడు పొట్ట భాగం దగ్గర నుంచి మిగతా శరీర భాగం అంతా షేప్‌ అవుట్‌గా ఉంటుంది. పైగా బరువు తగ్గడం కూడా అంత ఈజీ కాదు. అయితే ఆమెకు కూడా ఎలా తన అధిక బరువుని తగ్గించుకోవాలో తెలియలేదట. 

కానీ ప్రసవానంతరం బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామాలు ముఖ్యం. అయితే ఎలా ప్రారంభించాలో తెలియలేదని, దాంతో యూట్యూబ్‌లో పొట్ట భాగం తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది అని సర్చ్‌ చేసి మరి ప్రారభించినట్లు తెలిపింది. తాను చేసిన వ్యాయమాలు గురించి కూడా వివరించింది.

వర్కౌట్ 1: ప్రారంభకులకు అనువైన చేతి వ్యాయామాలు
దీప్తి, తక్కువ పరికరాలు అవసరమయ్యే సులభమైన నిలబడి చేసే వ్యాయామాలతో ప్రారంభించాలని సిఫార్సు చేస్తోంది.  ఎక్కడైనా నిలబడి, అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్ లేదా డంబెల్ ఏదైనా తీసుకుని, ప్రతి వైపు 15 సార్లు చొప్పున మూడు సెట్లు చేయాలని ఆమె సలహా ఇస్తోంది.

వర్కౌట్ 2: డంబెల్ ఆర్మ్ రైజెస్
5 కేజీల డంబెల్‌ను ఉపయోగించి, దీప్తి చేతులను బలోపేతం చేసే తేలికపాటి వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. ముందుగా 5 కేజీల డంబెల్‌ను పట్టుకుని, చేతులను నిటారుగా ఉంచి ప్రారంభించాలని చెప్పింది. దీన్ని ప్రతివైపు 15 సార్లు చొప్పున మూడు సార్లు చేయాలని చెప్పిందామె.

వర్కౌట్ 3: స్క్వాట్స్
స్క్వాట్స్ ఆమె దినచర్యలో మరొక ముఖ్యమైన వ్యాయామం. కొత్తగా చేసేవారైతే డంబెల్ లేకుండా వీటిని చేయవచ్చు. లేకపోతే, డంబెల్ పట్టుకుని సాధారణ స్క్వాట్స్ చేయాలని పేర్కొంది. ఇలా మొత్తం15 రిపిటీషన్లు చొప్పున మూడు సెట్లు చేయమని సూచిస్తుంది.

వర్కౌట్ 4: స్టాండింగ్ కిక్స్
అలాగే ఆమె తన దినచర్యలో స్టాండింగ్ కిక్ వ్యాయామాలను కూడా చేర్చుకుంటుంది. కేవలం తన్నడం లేదా తాకేలా చేసే వ్యాయామం. ఇక్కడ ఏది సౌకర్యంగా ఉంటే అది చేయవచ్చు. ఇక్కడ ప్రతి వ్యాయామాన్ని 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు చేయాలని ఆమె వివరించారు.

వర్కౌట్ 5: తలపైన చేతులతో చప్పట్లు
ఇది కూడా ఒక సులభమైన కదలిక. చేతులను తల పైకి ఎత్తి, పదేపదే చప్పట్లు కొట్టాలి. ఈ వ్యాయామం చాలా సులభం. చేతులు పైకి, అదే పనిగా చప్పట్లు కొట్టాలి.

వర్కౌట్ 6: వెనుకకు కాలును చాచడం
తన చివరి వ్యాయామం కోసం, దీప్తి తన చేతులను తలపైన జోడించి, ఒక కాలును వెనుకకు చాచాలి. ఇక్కడ కాలును వీలైనంత వెనుకకు తీసుకువెళ్లి, ఆ తర్వాత ముందుకు తీసుకురండి. ప్రతి వైపు 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు పూర్తి చేయాలిన చెప్పిందామె.

గమనిక: ప్రసవానంతర వ్యాయామ దినచర్యలను ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి, ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత, ఎందుకంటే కోలుకోవడానికి పట్టే సమయం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది.

 

(చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement