కొత్త హెయిర్‌ స్టైల్‌లో విరాట్‌ కోహ్లీ..వావ్‌!అంటూ ఫ్యాన్స్‌ కితాబు! | Sakshi
Sakshi News home page

కొత్త హెయిర్‌ స్టైల్‌లో విరాట్‌ కోహ్లీ..వావ్‌!అంటూ ఫ్యాన్స్‌ కితాబు!

Published Mon, May 20 2024 2:21 PM

Virat Kohlis New Raw And Grungy Haircut Is Going Viral

భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లకి విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్‌గానే గాక.. స్టైలీష్ ఐకాన్‌గా కూడా మంచి గుర్తింపు పొందాడు. చాలామంది అభిమానులు విరాట్‌ స్టైల్‌నే ఫాలో అవుతుంటారు. అంతలా ఉంటుంది ఆయన హెయిర్‌ స్టైల్‌కి, గడ్డం స్టైల్‌కి క్రేజ్‌. ప్రతి ఐపీఎస్‌ మ్యాచ్‌కి కోహ్లీ కొత్త లుక్‌లో ఎంట్రీ ఇస్తూ..అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులోనూ ఈసారీ టీ20 వరల్డ్‌ కప్‌ రెండు వారాల్లో జరగనుంది. అందుకోసం  కోహ్లీ ఏ హెయిర్‌స్టైల్‌తో కనిపించనున్నాడా? అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్‌. ఈసారి  కోహ్లీ కేశాలంకరణ ఏ స్టయిల్‌లో ఉందంటే..

విరాట్‌ని డిఫెరెంట్‌ డిఫెరెంట్‌ స్టయిల్‌ కనిపించేలా మెరుగులు దిద్దేది సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. అతడి స్టైలిష్‌ నైపుణ్యంతో విరాట్‌ లుక్‌ని మరింత ఎంట్రాక్టివ్‌గా కనిపించేలా చేస్తాడు. ముఖ్యంగా అతడి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యి  స్టయిల్‌నే ఫాలో అయ్యేంతగా ఆకర్ణణీయంగా మలుస్తాడు. ఈసారి హకీమ్‌ చాలా కొత్తగా.. కోహ్లి లుక్‌ని ప్రజెంట్‌ చేశాడు. 

 

వన్‌ అండ్‌ ఓన్లీ కింగ్‌ కోహ్లీ కోసం గ్రుంగి షార్ప్ హ్యారీకట్‌ని ఎంచుకున్నట్లు హకీమ్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. ఇది గ్రాడ్యయేషన్‌ చేస్తున్న కుర్రాడి లుక్‌ని ఇస్తుందని చెప్పాడు. ఫ్రంట్‌ హెయిర్‌లెస్‌గా ఉండి, మిగతా అంతా పొడవుగా ఉండి కదలికలు ఉండేలా సరికొత్త హెయిర్‌ స్టయిల్‌ని సెట్‌ చేశాడు హకీమ్‌.  ఇక హకీమ్‌ బాలీవుడ్‌ సినీ ప్రముఖుల నుంచి ప్రసిద్ధ సెలబ్రిటీలకు డిఫరెంట్‌ హెయిర్‌ స్టయిల్‌ పరిచయం చేస్తుంటాడు. అతడు ఏకంగా లక్ష రూపాయల దాక చార్జ్‌ చేస్తాడు.

కోహ్లీ కొత్త హెయిర్‌ స్టైల్‌కి సంబంధించిన న్యూలుక్‌ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్ల రెండు రోజుల్లో జరగనున్ను టీ20 ప్రపంచకప్‌కి తగ్గ కొత్తహెయిర్‌ స్టయిల్‌ ఇది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని ఆర్సీబీ జెర్సీ ధరించి..హృదయపూర్వకంగా నవ్వుతున్న కోహ్లీ వీడియోని షేర్‌ చేస్తూ..  టీ20 వరల్డ్‌ కప్‌కి విరాట్‌ కొత్త హెయిర్‌ స్టైల్‌ అని పేర్కొంటూ సోషల్‌ మీడియా ఎక్స్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు.

 

(చదవండి: సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌! ఎందువల్ల వస్తుందంటే..?)

Advertisement
 
Advertisement
 
Advertisement