బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్‌.. ఏ దేశం వంటకం అంటే.. | Viral Video: Japans Giant Sesame Ball Calls It Cosmic Bhatura | Sakshi
Sakshi News home page

బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్‌.. ఏ దేశం వంటకం అంటే..

Published Thu, Jun 20 2024 11:11 AM | Last Updated on Thu, Jun 20 2024 6:42 PM

Viral Video: Japans Giant Sesame Ball Calls It Cosmic Bhatura

ప్రతి దేశం ఒక్కో రకమైన వంటకంలో ఫేమస్‌ అవుతుంది. ఆ వంటకం పేరు వినగానే వెంటనే ఆ దేశం లేదా ప్రాంతం పేరు మనకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా కొన్ని రకాల వంటకాలు మన మనసులో స్థానం దక్కించుకుంటాయి. అలానే ఇక్కడొక వంటకం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఈ వంటకం మన భారతీయ వంటకానికి దగ్గర పోలిక ఉన్న రెసిపీలానే ఉంటుంది. కానీ వాళ్లు తయారీ చేసిన విధానం మాత్రం వావ్‌ అనాల్సిందే. ఇంతకీ ఏంటా వంటకం, ఏ దేశానికి సంబంధించింది అంటే..

జపాన్‌ పాకశాస్త్ర నిపుణులు బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేశారు. అది ఎక్కడ వంకర లేకుండా..గుండ్రటి బంతి ఆకారంలో ఉంది. పైగా ప్లేటంతా ఆక్రమించేసింది. దీన్ని ఎలా చేస్తారంటే..మైదాపిండికి కొద్ది మోతాదు బొంబాయిరవ్వను కలిపి పులియబెట్టేలా కొద్దిగా ఈస్ట్‌ జోడించి చపాతి పిండి మాదిరిగా నీళ్లతో కలిపి ఒక పక్కన ఉంచాలి. తర్వాత చిన్నసైజు ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలిన. కానీ వేయించేటప్పుడూ బంతి షేపులోకి పొంగేలా జాగ్రత్తగా వేయించాలి. అంతేగాదు ఈ పిండిని ఎంత ఎక్కువ సేపు నానిస్తే అంతలా అవి డీప్‌ ఫ్రై చేసేటప్పుడూ కచ్చితమైన చందామామ లాంటి ఆకృతికి వస్తాయి. 

మన ఇండియన వంటకమైన భాతురా రెసిపీకి దగ్గరగా ఉంటుంది ఈ వంటకం. ఇది పంజాబీ వంటకం. ఇది కూడా ఒక విధమైన పులియబెట్టిన బన్‌ లేదా పూరీ మాదిరిగా ఉండే వంటకం. మనం ఎలా అయితే పూరీలను సెనగలు ఆలు కర్రీ లేదా కుర్మాతో తింటామో అలానే ఈ జపాన్‌ రెసీపీని కూడా ఇంచుమించుగా అదే మాదిరి స్పైసీ కర్రీతో తింటారట అక్కడ ప్రజలు. దీన్ని వాళ్లు "జెయింట్‌ సెసేమ్‌ బాల్‌" అని పిలుస్తారట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ రెసిపీని కాస్మిక్‌ భాతురా, బంతి ఆకారపు పూరీ అని రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్‌ చేస్తుండగా..అంతలోనే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement