అమ్మ కావాలి... | Viral Abandoned Baby Monkey Punch Finds Comfort In A Plush Toy, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అమ్మ కావాలి...

Feb 21 2026 9:16 AM | Updated on Feb 21 2026 9:37 AM

అమ్మ కావాలి... ఎప్పుడూ కావాలి... ఎల్లప్పుడూ కావాలి... పగలు ఆకలేసినా... నిద్ర నిద్ర కమ్ముకున్నా అమ్మ కావాలి. అమ్మ ఎత్తుకొని తిప్పాలి. తల నిమరాలి. బువ్వ పెట్టాలి. ముద్దు చేయాలి. దిష్టి తియాలి. మురిసిపోవాలి. ‘నా బంగారు కన్నా’... ‘చిన్ని నాన్నా’ అని గారాలు చేయాలి. అమ్మ ఆయువు పోయాలి. ఊపిరులూదాలి. పెంచాలి. గుండెకు హత్తుకుని నేనున్నా అని భరోసా ఇవ్వాలి.

మరి అమ్మ లేకపోతే. కనపడకుండా పోతే. ఎక్కడికి వెళ్లిందో తెలియకపోతే. పసిబిడ్డకే కాదు... నోరు లేని జీవికి కూడా ఆ బాధ చాలా పెద్ద బాధ.ఇక్కడ చూడండి. ఈ కోతి పిల్ల పేరు పుంచ్‌. ఈ పిల్ల తల్లి ఇది పుట్టిన వెంటనే వదిలేసి పోయింది. ఆ తల్లి బంధాన్ని తెంపుకుని పోయింది గానీ పిల్లకు తల్లి మరపుకు రాదే. పదే పదే తల్లి కావాలనిపిస్తుంది. తల్లిని తలుచుకుని ఉలికులికి పడి నిద్ర లేస్తూనే ఉంటుందే.

పుంచ్‌కు ఇప్పుడు ఏడు నెలల వయసు. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉంటోంది. అమ్మ కోసం అది పడే బాధను చూసి జూ అధికారులు దానికో ఉరాంగుటాన్‌ బొమ్మను ఇచ్చారు. దానికి ఆ బొమ్మే అమ్మ. దాని కన్నీరు ఆ బొమ్మకు తెలియదు. అమ్మకే తెలియనప్పుడు... బొమ్మకేం తెలుస్తుంది?

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement