‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు.. | The Value Of Food Donation In Indian Tradition | Sakshi
Sakshi News home page

అన్నదానం మహాదానం!

Jun 4 2026 8:12 AM | Updated on Jun 4 2026 8:12 AM

The Value Of Food Donation In Indian Tradition

శతక నీతి

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు.. భారతీయ సంప్రదాయంలో అతిధులకు అన్నం పెట్టడం పరిపాటి.. అన్నార్తుల ఆకలి తీర్చడం ఒక అనవాయితీ. అందుకే అన్ని దానాల్లో అన్నదానాన్ని గొప్పదానంగా పరిగణిస్తారు.

వేమన శతకంలో..
అన్నిదానములను నన్నదానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనము లేదు
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ

వేమన ఆటవెలదిలో వదిలిన పదాలు.. మాటలు కాదు, తూటాలు.. నేరుగా నిక్కచ్చిగా చె΄్తాడు..  మొదటి పంక్తి సారం...
సత్కారభావనతో, ఆదరంగా మర్యాద గా ఇచ్చేది దానం. అశ్రద్ధతో ఇచ్చే దానం ‘అసత్త’ని చె΄్తారు.. దేశే, కాలే, పాత్రే అనేవి ఒక నియమం.. కాని మరో పద్యంలో

‘అన్నదానమునకు నధిక సంపదగల్గి
అమరలోక పూజ్యుడుగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా
విశ్వదాభిరామ వినురవేమ’ అని అంటాడు వేమన.

అన్నదానం అటుపక్క వ్యక్తికి ఆకలి తీర్చడమే కాదు, దాత దేవలోకంలో పూజింపబడుతాడు.. చూశారా పట్టెడు అన్నం ఇవ్వగానే పుట్టెడు పుణ్యం వస్తుందట..

సుమతి శతకంలో..
‘ఆకొన్న కూడే యమృతము
తాకొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్‌’..

ఆకలి తో ఉన్న వారికీ పెట్టే అన్నం అమృతం.. అలాంటప్పుడు పెట్టినవాడే దాత..
అంతే కాదుట,‘పెట్టిన దినములలోపలన్‌ నడు అడవులకు ద్రవ్యాలన్ని వచ్చున్‌ ‘... దాతకు అడవిలో కూడా అన్నీ దొరుకుతాయి అని భావం.

భర్తృహరి తన శతకంలో దానం గూర్చి చెప్తూ ధనంలో కొంత భాగం దానం చేయండి అని అంటారు..‘దానము భోగము నెఱుగని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగన్‌’ పరోక్షంగా దానం చేయమని సలహా.. మరో పద్యంలో కొంతమందిని ఉదాహరిస్తూ.. వీరు విశేషంగా ప్రకాశించుతారు.. ఈ జాబితాలో ‘ధనైకవి శ్రావన’ అంటే ధనాన్ని మిక్కిలి దానం చేయువాడు ఒకరు.

‘దానముచేయునేరని యు, ధార్మికు సంపద యుండి యుండి యున్‌
దానె పలాయనం బగుట తథ్యం’ అన్నారు భాస్కర శతకంలో... దానం ఇవ్వక పోతే సంపద పోతుందని...
ధనం ఉంటే అన్న దానం చేయవచ్చు...

ఇలా అన్ని శాస్త్రాల్లో, ఎన్నో శతకాల్లో అన్నదానం గూర్చి చె΄్పారు.. పుణ్యం మాట దేవుడెరుగు... సాటి మానవుడి ఆకలిని తీర్చే పరిస్థితి, గుణం, సంసిద్ధత ఉండాలి. అన్నమో రామచంద్ర అని వినగానే ఇదిగో వడ్డిస్తున్నాను రండి అనే సంస్కృతి మనది.. అన్నదానం అనగానే అన్నపూర్ణలాంటి డొక్కా సీతమ్మ గారు గుర్తు రాకమానదు. – డా. కందాళ సత్యనారాయణ మూర్తి  

Advertisement
 
Advertisement
Advertisement