టైమ్‌ కాప్య్సూల్‌ 2047

Time capsule is viral on social media - Sakshi

కాలంతో పాటు నడవడం ఎంత ముఖ్యమో భవిష్యత్‌ దార్శనికత కూడా అంతే ముఖ్యం. టైమ్‌ క్యాప్య్సూల్‌ అనేది మన వర్తమాన,భవిష్యత్‌ ఆలోచనల సమ్మేళనం. ఐఐటీ, దిల్లీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించిన కాలనాళిక (టైమ్‌ క్యాప్య్సూల్‌) సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

‘ఇండియా @ 2047’ పై అభిప్రాయాలను సేకరించి ఇందులో భద్రపరిచారు. ఈ టైమ్‌ క్యాప్య్సూల్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేశారు. దీని బరువు 75 కిలోలు. ఈ కాలనాళికను 2047లో తెరుస్తారు. భవిష్యత్‌కు సంబంధించిన మన ఆశాజనకమైన అంచనాలు వాస్తవమైతే అంతకంటే సంతోషం ఏమున్నది!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top