
అతి అనర్థానికి దారితీస్తుంది అన్నట్లు... ఒక తైవాన్ వ్యక్తికి, తన పాత థర్మోస్ ఫ్లాస్కుపై ఉన్న మమకారం, చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఏదైనా తాగాలంటే అదే థర్మోస్ ఫ్లాస్కును ఎక్కడికెళ్లినా చేతిలో పెట్టుకొని తిరిగేవాడు. అది తుప్పు పట్టింది, రంగు మారింది. కాని, మనోడు మాత్రం ‘ఇంకా బాగానే ఉంది!’ అంటూ పుల్లటి పానీయాలు, కాఫీ, జ్యూస్ అన్నీ అదే బాటిల్‌లో పోసుకుని తాగుతూనే ఉండేవాడు. అలా పదేళ్లు వాడేశాడు.
అయితే, తుప్పు, పానీయాల్లోని పులుపు కలసి లోహాలను పానీయాల్లోకి విడుదల చేశాయి. అవి శరీరంలోకి చేరి నెమ్మదిగా విషపూరితం చేశాయి. మొదట జలుబు, ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెఫెక్షన్. రక్త పరీక్షల్లో చూసిన డాక్టర్లు ‘ఇది రక్తమా! లేక ఖనిజాల ద్రావణమా!’ అంటూ షాక్ అయ్యారు. బ్లడ్‌లో సీసం, క్రోమియం, నికెల్ వంటి భార లోహాలు ఉన్నాయి.
అసలు కారణం? అదే పాత థర్మోస్ ఫ్లాస్కు కడిగినంత మాత్రాన శుభ్రమవుతుందని అనుకున్నాడు. కాని, అది అతని రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. చివరకు అతని ప్రాణాలే పోయాయి. ఇప్పుడు ఈ తైవాన్ స్టోరీ ప్రజలకు ఒక తీవ్ర హెచ్చరికగా మారింది.
(చదవండి: విమానాలకు సోడియం ఇంధనం!)