బరువు తగ్గాలంటే.. మోయాలంతే! | Staying Fit Is Eery Important To Look Smart | Sakshi
Sakshi News home page

బరువు తగ్గాలంటే.. మోయాలంతే!

Jun 13 2026 9:40 AM | Updated on Jun 13 2026 11:28 AM

Staying Fit Is Eery Important To Look Smart

ఫిట్‌నెస్‌ మంత్ర ‘రక్కింగ్‌’

స్మార్ట్‌ ఉండాలంటే ఆలోచిస్తే సరిపోదు.. ఫిట్‌గా కూడా ఉండాలి. అలాంటప్పుడే బ్రెయిన్‌ బాగా పని చేస్తుంది. పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత చాలామంది ఫిట్‌సెస్‌ సెంటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామాల్లో కూడా కొత్త విధానాలొచ్చేస్తున్నాయి. జిమ్, ఏరోబిక్స్, యోగా లాంటివి..కాని ఇవ్వన్నీ కామన్‌.. ఇప్పుడు కొత్తరకం ఫిట్‌నెస్‌ మంత్ర వచ్చింది అదే ‘రక్కింగ్‌’.

కొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ ఇప్పుడు బాగాప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో ఒక నిర్దిష్ట బరువున్న వెస్ట్‌ను లేదా బ్యాక్‌ప్యాక్‌ను ధరించి నడస్తూ వెళ్లాలి. అలా అనుకున్న టార్గెట్‌ వరకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఒకసారి టార్గెట్‌ పూర్తయ్యాక నడకలో కాస్త వేగాన్ని పెంచాలి. అమెరికా, యూరప్‌లలో ఇప్పటికే ఈ పద్ధతిని లక్షల మంది ఫాలో అవుతున్నారు.

ఈ రక్కింగ్‌ వల్ల కాళ్ల కండరాలు రక్తప్రసరణ జరిగి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వాస్తవానికి ఇదేం కొత్త పద్ధతేం కాదు.. మిలటరీ శిక్షణలో భాగంగా సైనికులకు తుపాకీ, బ్యాక్‌ప్యాక్‌ ఇచ్చి నడిపిస్తారు. ఈ పద్ధతినే జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి కొత్తరకం ఫిట్‌నెస్‌ సూత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఊబకాయంతో బాధపడేవారికి మాత్రం ఈ రక్కింగ్‌ పద్ధతే కరెక్ట్‌... పైగా రక్కింగ్‌ చేయడానికి జిమ్‌లకు, యోగా క్లాసులకు వెళ్లక్కర్లేదు. ఎవరైనా ఇంట్లో ఉంటూ రక్కింగ్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement