
కేరళలోని కోజికోడ్‌కు చెందిన కీర్తన కున్నాత్ లండన్‌లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్‌లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్‌కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది.
‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది.
డాటర్ ఆఫ్ రఘు రాయ్
చిన్నప్పుడు గిఫ్ట్‌గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు.
అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్‌లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్‌లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది.
(చదవండి: అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..! సర్వేలో షాకింగ్ విషయాలు..)