
అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలనేది మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆచారాన్నే మనం తరతరాలుగా అనుసరిస్తున్నాం కూడా. అలాంటిది ఇటీవల కాలంలో అబ్బాయి-అమ్మాయి వయసు అంతరాలు ఎంతలా ఉన్నాయంటే..అమ్మాయి వయసే ఎక్కువగా ఉంటోంది. అలానే పెళ్లి చేసుకుంటున్నారు. అభిషేక్ ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినా-విక్కీ కౌశల్, సచిన్ టెండుల్కర్ అంజిలి వంటి ప్రముఖులంతా తమ భార్యల వయసు కంటే చిన్నవారే. దాంపత్య జీవితానికి వయసుతో సంబంధ లేదంటూ ఎంతో హాయిగా వైవాహిక బంధాన్ని లీడ్ చేస్తున్నారు వారంతా. తాజాగా ఆ కోవలోకి సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కూడా చేరిపోయాడు. అసలు అమ్మాయిలంతా ఇలా వయసులో తమ కంటే చిన్నవారితో ప్రేమలో పడిపోవడానికి రీజన్ ఏంటీ..?. అసలు ఎందుకిలా ఇదొక ట్రెండ్‌లా మారిపోయింది..?
ఇవాళ అమ్మాయిలు వయసులో తమ కంటే చిన్నవారినే ఇష్టపడుతున్నారు. వారినే వరిస్తున్నారు కూడా. గతానికి మరింత భిన్నంగా ఇవాళ ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా ఎందుకు సాగుతుందనే దానిపై పలు అధ్యనాలు కూడా జరిగాయి. అసలు మహిళలు తమ కంటే చిన్న వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడుతున్నారని సర్వే కూడా చేశారు. అందులో చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..
పెద్ద వయసు మహిళలంతా తమ కంటే ఏజ్‌లో చిన్నగా ఉండే పురుషులతో బంధం ఏర్పుచుకోవాలని కోరుకుంటున్నారట. వారిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. చిన్నవయసు అబ్బాయితో డేటింగ్ చేస్తే..వాళ్లు ఎంతో కంఫర్ట్‌గా ఫీలవుతారట. తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందట. పైగా వాళ్లు ఎవ్వరినైన సమ్మోహనంలోకి దింపగలం అనే భావన కలుగుతుందట. శారీరక సంబంధం పరంగా కూడా చిన్న వయసు వారైతేనే బెటర్ అట
అంతేగాదు దీనిపై ఇటీవల డేటింగ్ యాప్ 'బంబుల్' ఒక సర్వే కూడా నిర్వహించింది. అందులో దాదాపు 60% మంది అమ్మాయిలు తమ కంటే చిన్నవారినే భాగస్వాములుగా కోరుకుంటున్నారట. మరోవైపు అబ్బాయి అమ్మాయిలు ఆలోచనల పరంగా సర్వే చేస్తే కూడా..సుమారు 63% మంది ప్రేమలో వయసు పట్టింపు లేదని విశ్వసిస్తున్నారట. ఈ వ్యక్తులు తమ కంటే పెద్దవారు లేదా చిన్నవారు ఇలా ఎవ్వరితోనైనా డేటింగ్ చేసేందుకు రెడీ అంటున్నారట. అన్నింట్ల కంటే ఆసక్తిని రేకెత్తించే అంశం ఏంటంటే సుమారు 35% మంది అమ్మాయిలు శారీరక సంబంధం కంటే భావోద్వేగ అనుబంధానికే ప్రాధాన్యత ఇవ్వడం.
ఇదిలా ఉండగా..బాలీవుడ్ నటి, ఎంటర్‌ప్రెన్యూర్ పారుల్ గులాటి ఒక పాడ్‌కాస్ట్‌లో సంబంధ బాంధవ్యాలపై మారుతున్న యువత ఆలోచనతీరు అనే అంశంపై ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా తమ కంటే వయసులో చిన్న వారైన పురుషులనే పెళ్లిచేసుకుంటున్నారంటూ మాట్లాడటంతో ఈ విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బహుశా చిన్నవాళ్లైతే తమకు నచ్చినట్లుగా నడుచుకుంటారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారనే అభిప్రాయం కావొచ్చని పేర్కొంది.
పైగా వారితో మాట్లాడటం సులభంగా ఉంటుందట. స్త్రీ సహజంగా తన మాట వినేవాళ్లను ఇష్టపడుతుంది ఆ కోణంలో ఇలా తన కంటే చిన్నవాళ్లని ఇష్టపడుతున్నట్లుగా పారుల్ చెప్పుకొచ్చింది. అలాగే బ్రేకప్ అవ్వడానికి గల కారణాల గురించి కూడా మాట్లాడింది. పురుషులు మారిపోయారని మహిళలు భావస్తారు, అలాగే పురుషులు మహిళలు తమను ఎప్పుడు వదిలి వెళ్లరని ప్రగాఢంగా నమ్మడం వంటి అంచనాల వల్లే బంధం విచ్ఛిన్నమవుతుందని చెప్పింది.
అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న సందేహం రాగానే.. మారేందుకు ప్రయత్నించపోవడం, బహిరంగా మాట్లాడనప్పుడూ.. పెను సమస్యగా మారి విడిపోయేందుకు దారితీస్తుందని పేర్కొంది. కానీ ఈ జనరేషన్ యువకులు మునుపటికంటే భావోద్వేగ పరంగా తెలివిగా ఉంటున్నారు, అందుకే వారు వయసు అంతరానికి ప్రాధ్యానత్య ఇవ్వడం లేదని వివరించింది.
(చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!)