నది మధ్యలో ఫోటోషూట్‌: అనుకోని అతిథిని చూసి భయంతో యువతి.. | Snake Photobomb In Pre Wedding Shoot Thier Reaction Goes Viral | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకు కాన్ఫిడెన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. రియాక్షన్‌ వైరల్‌

Dec 21 2023 1:04 PM | Updated on Dec 21 2023 3:34 PM

Snake Photobomb In Pre Wedding Shoot Thier Reaction Goes Viral - Sakshi

ఈరోజుల్లో ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్స్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. కళ్లు చెదిరే లొకేషన్లలో అద్భుతమైన సెట్టింగులతో, ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేనకడుగు వేయడం లేదు. సినిమా స్టైల్‌ను తలపించే లైటింగ్స్‌, ఎఫెక్ట్స్‌, రిచ్‌నెస్‌తో ఫోటోషూట్స్‌ పెట్టుకుంటున్నారు. దీనికోసం ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు.

తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఢిపరెంట్‌ స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ ఇప్పుడు అందరి దృష్టని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్‌గా ఓ జంట తీయించుకున్న ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ నదిలో కాబోయే జంట అందంగా ఫోటోలకు ఫోజులిస్తుండగా పాము అనుకోని అతిథిలా ఫ్రేమ్‌లోకి వచ్చింది. దీంతో యువతి భయపడి కేకలు వేయగా, ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పాడు. కాసేపట్లోనే ఆ పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

ఈ మొత్తం తతంగాన్ని ఫోటోగ్రాఫర్‌ కెమెరాలో బంధించాడు. వైల్డ్‌ ఫోటోషూట్‌ అంటూ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. ఇప్పటికే 53 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాము ఒంటిపై నుంచి వెళ్లినా అదరకుండా, బెదరకుండా చాలా చిల్‌ మూడ్‌లో ఉన్నారంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. పామును చూసి ఆ అమ్మాయి భయపడినప్పుడు ఆమె కాబోయే భర్త ధైర్యం చెప్పిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement