పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి..

Simple Tips To Make Hair Silky And Soft In telugu - Sakshi

► రెండు కోడిగుడ్ల తెల్లసొనలో రెండు టీ స్పూన్ల ఆముదం, ఒక టీస్పూన్‌ గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల మొదలు నుంచి జుట్టుకంతా పట్టించి, 20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.

► ముందురోజు రాత్రి ఒక కప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు నాలుగయిదు మందార ఆకులని జతచేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాలపాటు ఉంచి తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

► ఒక పాత్రలో టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి.

► తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.  వారంలో ఒక్కసారయినా టీ డికాషన్‌ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

► పెరుగు కదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా మెరుస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top