తడిసిన పుస్తకం.. మూడు రోజుల కూలీ! | A Short Story Of Abraham Lincoln's Life Kids Special | Sakshi
Sakshi News home page

తడిసిన పుస్తకం.. మూడు రోజుల కూలీ!

Jun 13 2026 11:38 AM | Updated on Jun 13 2026 12:07 PM

A Short Story Of Abraham Lincoln's Life Kids Special

కిడ్స్‌ స్పెషల్‌

మహనీయుల బాల్యం

అబ్రహాం లింకన్‌ కి 11 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియానాలోని పిజన్‌ క్రీక్‌ దగ్గర ఉండేవాడు. చదువంటే పిచ్చి. పక్క ఊరిలో జోసియా క్రాఫోర్డ్‌ అనే రైతు దగ్గర ‘ద లైఫ్‌ ఆఫ్‌ జార్జ్‌ వాషింగ్టన్‌’ అనే పుస్తకం ఉందని తెలిసింది. లింకన్‌ బతిమాలి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి వర్షం. గుడిసె కప్పులో నుంచి నీళ్లు కారి, పుస్తకం తడిసి నాశనం అయ్యింది.

తెల్లారి లింకన్‌ ఏడుస్తూ క్రాఫోర్డ్‌ దగ్గరికి వెళ్లి, ‘నేను పుస్తకం పాడు చేశాను సార్‌’ అని ఒప్పుకున్నాడు. క్రాఫోర్డ్‌ దానికి ‘సరే, మూడు రోజులు నా పొలంలో పని చెయ్‌. అప్పు తీరిపోతుంది’ అన్నాడు. 11 ఏళ్ల లింకన్‌ మొక్కజొన్న పొలంలో, పందుల షెడ్డులో మూడు రోజులు కూలి చేశాడు. పుస్తకానికి ఖరీదు కట్టాడు. ఆ పుస్తకాన్ని మళ్లీ ఎండబెట్టి, అట్ట వేసి, పూర్తిగా చదివాడు. నిజాయితీ ఉన్నవాడు పైకి వస్తాడని ఈ ఘటన చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement