శంఖం... లక్ష్మీ స్వరూపం | shankham Lakshmi Devi swarupam | Sakshi
Sakshi News home page

శంఖం... లక్ష్మీ స్వరూపం

Published Thu, Sep 5 2024 12:23 PM | Last Updated on Thu, Sep 5 2024 12:23 PM

shankham Lakshmi Devi swarupam


ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. శ్రీమన్నారాయణుని మన సనాతన ధర్మంలో శంఖాన్ని మహావిష్ణు  స్వరూపంగా, లక్ష్మీప్రదంగా వివరించారు.శంఖంలో పోస్తేనే తీర్థమన్నారు మనవారు. శాస్త్రప్రకారం శంఖం లక్ష్మీస్వరూపం.

సముద్రంలో జీవించు ఒక ప్రాణి ఆత్మరక్షణ కోసం శరీరానికి నాలుగువైపుల రక్షణ కవచం నిర్మించుకొంటుంది. కొంతకాలం తర్వాత అది కవచం వదిలి కొత్త కవచం కట్టుకోవడంలో లీనమవుతుంది. ఆ కవచమే మనకు చిరపరిచయమైన శంఖం.

అర్చన సమయాలలో శంఖనాదం చేస్తారు. బెంగాల్‌లో వివాహ సందర్భంగా శంఖధ్వని తప్పనిసరి, శంఖం లోపలి భాగం ముత్యంలా ఉంటుంది. అందులో చెవి పెట్టి వింటే సముద్ర ఘోష వినిపిస్తుంది. శంఖంలో ΄ోసిన తీర్థం సేవించడం వల్ల వాత పిత్త దోషాలు, సమస్త రోగాలు తొలగి ΄ోతాయని పరమపురుష సంహిత చెబుతోంది.

శంఖాలలో దక్షిణావర్త శంఖం శ్రీ విష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అయింది. ఈ శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుందని ప్రతీతి. చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్యదినాలలో ఇంట్లో పూజచేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురుపుష్యమి, రవిపుష్యమి నక్షత్రాలు, పుణ్యతిథులు ఈ పర్వదినాల్లో తప్పకుండా పూజ చేయాలని పెద్దలు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement