Sesame Crusted Chicken: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్‌ చికెన్‌!

Recipes In Telugu: How To Make Sesame Crusted Chicken - Sakshi

చికెన్‌, కోడిగుడ్లు, మొక్కజొన్న పిండి, నువ్వులు సెసెమీ క్రస్టెడ్‌ చికెన్‌ ఇలా తయారు చేసుకోండి! 
కావలసినవి:
►బోన్‌లెస్‌ చికెన్‌ – ఒక కేజీ (ముక్కలు పొడవుగా కట్‌ చేసుకోవాలి) 

మారినేషన్‌ కోసం:
►పెరుగు – కప్పు
►నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్‌లు
►పచ్చి బొప్పాయి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌
►గరం మసాలా పొడి– ఒక టీస్పూన్‌
►యాలకుల పొడి– అర టీ స్పూన్‌
►నూనె – 3 టేబుల్‌ స్పూన్‌లు
►ఉప్పు – రెండు టీ స్పూన్‌లు లేదా రుచికి తగినంత) 

కోటింగ్‌ కోసం:
►కోడిగుడ్లు – 3
►మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్‌లు
►ఉప్పు – అర టీ స్పూన్‌
►నువ్వులు – 3 టేబుల్‌ స్పూన్‌లు
►పచ్చిమిర్చి – 6 (సన్నగా తరగాలి)

►వెల్లుల్లి పేస్ట్‌– టీస్పూన్‌
►మిరప్పొడి – టీ స్పూన్‌
►వెనిగర్‌ – టేబుల్‌ స్పూన్‌
►బెల్లం తురుము – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌లు
►కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూన్‌..

తయారీ:
►చికెన్‌ను శుభ్రం చేసి, మారినేషన్‌ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
►కోటింగ్‌ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి కలపాలి.
►మారినేట్‌ చేసిన చికెన్‌ ముక్కలను కోటింగ్‌ మిశ్రమంలో వేసి తీసి నువ్వులలో వేసి (చికెన్‌ ముక్కల మసాలాలకు నువ్వులు అంటుకునేటట్లు) కలపాలి.
►అవెన్‌ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది నిమిషాల పాటు బేక్‌ చేయాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Til Ki Barfi And Sesame Veg Salad: నువ్వులతో ఆరోగ్యం.. తిల్‌ కీ బర్ఫీ, సెసెమీ వెజ్‌ సలాడ్‌ తయారీ ఇలా! 
Chatpattey Coconut Recipe: క్రంచీ.. కరకరలు.. చట్‌పటే కోకోనట్‌, బటాడా వడ తయారీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top