Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్‌ సలాడ్‌ శాండ్‌విచ్‌ ఇలా తయారు చేసుకోండి!

Recipes In Telugu: How To Make Prawns Salad Sandwich - Sakshi

రొయ్యలు ఇష్టంగా తినేవారు రొటీన్‌గా కర్రీ కాకుండా ఇలా ప్రాన్స్‌ సలాడ్‌ శాండ్‌విచ్‌ ట్రై చేసి చూడండి.

ప్రాన్స్‌ సలాడ్‌ శాండ్‌విచ్‌ తయారీకి కావలసినవి:
►బ్రెడ్‌ ముక్కలు – 8 లేదా 10
►పెద్ద రొయ్యలు – 15 (మెత్తగా ఉడికించి, ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
►గుడ్లు – 1 (ఉడికించి, ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
►వెన్న – 2 టేబుల్‌ స్పూన్లు
►ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా
►చీజ్‌ తురుము – 5 టేబుల్‌ స్పూన్ల పైనే
►మిరియాల పొడి – చిటికెడు
►కారం – అర టీ స్పూన్‌
►టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున

తయారీ:
►ముందుగా ఒక బౌల్‌ తీసుకుని, అందులో గుడ్ల ముక్కలు, రొయ్య ముక్కలు, వెన్న, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి గరిటెతో కలపాలి.
►అనంతరం ఒక్కో బ్రెడ్‌ పీస్‌ తీసుకుని.. దానిపై ఈ మిశ్రమాన్ని వేయాలి.
►అదే విధంగా కొద్దిగా టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు, చీజ్‌ తురుము ఇలా అన్నీ వేసుకుని.. మరో బ్రెడ్‌ పీస్‌ పెట్టుకోవాలి.
►త్రిభుజాకారంలో కట్‌ చేసుకుని, అన్ని వైపులా తడి చేత్తో గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి.
►ఆపైన బ్రష్‌తో ప్రతి బ్రెడ్‌కి నూనె పూసుకుని, ఓవెన్‌లో లేదా.. పాన్‌ మీద ఇరువైపులా దోరగా వేయించుకుని సర్వ్‌ చేసుకోవచ్చు. 

చదవండి: Royyalu Mulakkada Kura In Telugu: రుచికరమైన రొయ్యల ములక్కాడ కూర.. తయారీ ఇలా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top