breaking news
salad
-
పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల కాలంలో అందిరిలోనూ ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉంచుకునే యత్రం చేస్తున్నారు. అందులో భాగంగా మార్నింగ్ సమయంలో పచ్చి కూరగాయ సలాడ్లు, స్మూతీలు వంటివి తీసుకుంటున్నారు. అలానే ఇక్కడొక మహిళ బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా సలాడ్లు తీసుకునేది. ఆ తర్వాత కొద్దిరోజులకే అనారోగ్య పాలైంది. ఆమె ఎందికిలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని..పరీక్షించగా అసలు విషయం తెలిసి వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు దయ చేసి పచ్చి కూరగాయలు తినేందుకు ప్రయత్నించొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలా పచ్చిగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి సవివరంగా వెల్లడించారు. మరీ అవేంటో సవివరంగా తెలుసుకుందామా..!.35 ఏళ్ల మహిళ తరుచుగా తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నానంటూ ఆస్పత్రికి వచ్చింది. బరువు తగ్గే క్రమంలో స్ట్రిక్టడైట్ ఫాలో అయ్యి ఇలా ఇబ్బంది పడుతుందా అనే దిశగా ఆ మహిళను విచారించారు. అయితే ఆ మహిళ స్ప్రుహతప్పి పడిపోవడం, మూర్చ వంటి పలు సమస్యలను ఎదుర్కొనడంతో రక్త పరీక్షలు వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమె మెదులో గాయంతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దానికి కారణమేంటని..చూసిన వైద్యుడి ఆరోగ్య చరిత్రలో తలకు గాయమైన దాఖాలాలు లేవు. దీంతో ఆమె ప్రతి రోజు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారని ప్రశ్నించగా..ఆమె పచ్చి క్యాబేజీ, పాలకూర వంటి కూరగాయలను తీసుకుంటానని చెప్పింది. దీని కారణంగానే ఆమె బ్రెయిన్ సిస్ట్‌తో బాధపడుతుందని వైద్యులు నిర్థారణకు వచ్చి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా జరగడానికి కారణం..ఈ పరిస్థితిని న్యూరోసిస్టిసెర్కోసిస్ లేదా బ్రెయిన్ వార్మ్ అని పిలుస్తారు. దీనికారణంగా పిల్లలు, పెద్దలు తరుచుగా మూర్చ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మరీ ఈ మహిళ ఈ పరిస్థితి బారిన పడటానికి ప్రధాన కారణం బ్రేక్ ఫాస్ట్‌గా సలాడ్‌లో తీసుకునే పచ్చి కాయగూరలేనని చెప్పారు. పచ్చి కాయగూరలు తీసుకోవడం మంచిది కాదా..? అంటే..ముమ్మాటికి మంచిది కాదనే అంటున్నారు వైద్యులు. వీటిల్లో బద్దె పురుగులు(టేప్‌వార్మ్ ) ఉంటాయట. మన నీటితో చక్కగా వాష్ చేశాం అనుకుంటాం గానీ.. అవి ఆకు మడతల్లో ఉండిపోతాయి. అంటే వాటికి సంబంధించిన లార్వాలు వంటివి పచ్చి కూరగాయల్లో ఉండిపోతాయట. ఎప్పుడైతే సలాడ్ పేరుతో పచ్చిగా తింటామో అవి నేరుగా మన కడుపులోకి నేరుగా వెళ్లిపోతాయి. దీంతో బ్రెయిన్ సిస్ట్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. మనం ఇలా పచ్చి కూరగాయలు తినగానే ఆ టేప్‌వార్మ్ సంబంధిత లార్వాలు రక్తప్రవాహంలోకి వెళ్లి..అక్కడ నుంచి మెదడు ప్రయాణించి తిత్తులుగా ఏర్పడతాయన్నారు. అంటే వాపు లేదా ద్రవం రూపంలో పేరుకుపోతాయట. దీంతో సదరు వ్యక్తికి తర్చుగా మూర్చలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.చికిత్స..యాంటీబయాటిక్, స్టిరాయిడ్లతో ఈ సమస్యను నివారిస్తామని తెలిపారు వైద్యులు. అయితే ఒక్కోసారి ఈ లార్వా గనుక చనిపోయినా..సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని అన్నారు. బాధితుడు తలనొప్పి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకుండా..సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే..ఈ సమస్య నుంచి త్వరితగతిని బయటపడగలరని చెప్పారు. అలాగే ఒక్కోసారి ఈ టేప్ వార్మ్ లార్వా ప్రేగులలో కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. తద్వారా చేతులు, కాళ్లలో వాపు వంటి సమస్యలు వస్తాయట.క్యాబేజీలోనే ఎక్కువ..!క్యాబేజీ బ్యాక్టీరియాకు నిలయమా..? అంటే..అది పెరిగే నేల, కడగడానికి ఉపయోగించే నీరు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే క్యాబేజ్‌ని నీటితో వాష్ చేసినప్పటికీ టేప్ వార్మ్ లార్వాలు ఆకుమడతల్లో ఉండిపోతాయి. అందువల్ల వీటిని వేడినీటిలో కొద్దిసేపు ఉడికించి.. సలాడ్‌గా తీసుకుంటే ప్రమాదం ఉండదని చెబుతున్నారు వైద్యుల. ఈ టేప్ వార్మ్ లార్వాలు తక్కువ ఉడికించే కూరగాయలు, మాంసంలో అలానే ఉండిపోతాయట. అందుకని తగు మోతాదులో ఉడికిస్తే ఎటువంటి సమయం ఉండదని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పెళ్లి బరాత్‌తో దద్దరిల్లిన వాల్‌స్ట్రీట్..! వీడియో వైరల్) -
జపాన్‌లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్‌లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..) -
Recipe: పెద్ద రొయ్యలతో ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీ ఇలా!
రొయ్యలు ఇష్టంగా తినేవారు రొటీన్‌గా కర్రీ కాకుండా ఇలా ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ ట్రై చేసి చూడండి. ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీకి కావలసినవి: ►బ్రెడ్ ముక్కలు – 8 లేదా 10 ►పెద్ద రొయ్యలు – 15 (మెత్తగా ఉడికించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►గుడ్లు – 1 (ఉడికించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►వెన్న – 2 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా ►చీజ్ తురుము – 5 టేబుల్ స్పూన్ల పైనే ►మిరియాల పొడి – చిటికెడు ►కారం – అర టీ స్పూన్ ►టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్ల చొప్పున తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో గుడ్ల ముక్కలు, రొయ్య ముక్కలు, వెన్న, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి గరిటెతో కలపాలి. ►అనంతరం ఒక్కో బ్రెడ్ పీస్ తీసుకుని.. దానిపై ఈ మిశ్రమాన్ని వేయాలి. ►అదే విధంగా కొద్దిగా టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు, చీజ్ తురుము ఇలా అన్నీ వేసుకుని.. మరో బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి. ►త్రిభుజాకారంలో కట్ చేసుకుని, అన్ని వైపులా తడి చేత్తో గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి. ►ఆపైన బ్రష్‌తో ప్రతి బ్రెడ్‌కి నూనె పూసుకుని, ఓవెన్లో లేదా.. పాన్ మీద ఇరువైపులా దోరగా వేయించుకుని సర్వ్ చేసుకోవచ్చు. చదవండి: Royyalu Mulakkada Kura In Telugu: రుచికరమైన రొయ్యల ములక్కాడ కూర.. తయారీ ఇలా! -
చెఫ్‌గా మారిన బన్నీ కొడుకు
హీరో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి అల్లరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బన్నీ, అతని భార్య స్నేహారెడ్డిలు పలు సందర్బాల్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ సారి మాత్రం అయాన్ కొత్తగా చెఫ్ అవతారం ఎత్తాడు. సలాడ్ తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (చదవండి : బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ) ఈ వీడియోలో అయాన్ సలాడ్ ఎలా తయారు చేయాలో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ సలాడ్ మనకు చాలా విటమిన్లను అందజేసి.. శరీరాన్ని బలంగా చేస్తుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అయాన్ క్యూట్‌నెస్ చూసిన బన్నీ అభిమానుల మురిసిపోతున్నారు. ఇటీవల బన్నీ కుమార్తె అర్హ.. బుట్టబొమ్మ సాంగ్‌కు లిప్ సింక్ ఇచ్చిన వీడియో కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘రాములో రాములా’.. మరో రికార్డు) -
చల్లాడ్స్
కట్ చేయండి... ఎండను తగ్గించండి... కలపండి... ఎండను తొలగించండి... ఫ్రిజ్‌లో పెట్టండి... ఎండను చల్లబరచండి... ఆరగించండి... ఎండను తరిమికొట్టండి... ఎండలకు సలాడ్‌తో జవాబు చెప్పండి... క్యాబేజీ, బీన్స్, రైస్, ఎగ్ ... కాదేదీ సలాడ్కనర్హం... ఆరోగ్యమూ చల్లదనమూ వీటి సొంతం! చికెన్ సలాడ్ విత్ చౌ మే నూడుల్స్ కావలసినవి: డ్రెసింగ్ కోసం: బ్రౌన్ సుగర్ – 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ – 2 టీ స్పూన్లు, కమలాపండు రసం – 2 టీ స్పూన్లు, నువ్వుల నూనె – 4 టీ స్పూన్లు, వెజిటబుల్ ఆయిల్ – పావు కప్పు, వెనిగర్ – 3 టేబుల్‌స్పూన్లు సలాడ్ కోసం: లెట్యూస్ ఆకు – ఒకటి (చిన్నది, సన్నగా తరగాలి. ఈ ఆకు దొరకని చోట క్యాబేజీ తరుగు ఉపయోగించుకోవచ్చు), ఉడికించిన బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్ – 4 ముక్కలు, ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లు, క్యారట్ తురుము – అర కప్పు, నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించకూడదు), పల్లీలు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), కమలా పండు తొనలు – 10 తయారీ: ∙డ్రెస్సింగ్ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో, లెట్యూస్ లేదా క్యాబేజీ తరుగు, చికెన్, ఉల్లికాడల తరుగు, డ్రై నూడుల్స్, క్యారట్ తురుము, పల్లీ ముక్కలు వేసి బాగా కలిపి, డ్రెసింగ్ వస్తువులు వేసిన పాత్రలో వేసి కలపాలి ∙కమలా పండు తొనలతో అలంకరించి, వెంటనే అందించాలి. గ్రీక్ రైస్ సలాడ్ కావలసినవి: అన్నం – 3 కప్పులు, పుట్ట గొడుగులు – కప్పు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీరు ఒంపేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి), టొమాటో – 1 (ముక్కలు చేయాలి), కీర దోస చక్రాలు – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, చీజ్ – పావు కప్పు, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను, మిరియాల పొడి – అర టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో అన్నం, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి మూత పెట్టి, ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీసేయాలి ∙బౌల్స్‌లో సర్వ్ చేసే ముందు, కొద్దిగా కొత్తిమీర వేసి అందించాలి. క్యాబేజీ సలాడ్ విత్ ఎ క్రంచ్ కావలసినవి: క్యాబేజీ తరుగు – ఒక కప్పు, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, నూడుల్స్ – ఒక ప్యాకెట్, నువ్వులు – ఒక టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4 (మెత్తగా చేయాలి), బాదం పప్పులు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)డ్రెసింగ్ కోసంసోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ – పావు కప్పు, పంచదార – అర కప్పు, రిఫైన్డ్ ఆయిల్ – పావు కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, అల్లం తురుము – పావు టీ స్పూను తయారీ: ∙పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక సోయా సాస్, వెనిగర్, పంచదార, రిఫైన్డ్ ఆయిల్, మిరియాల పొడి, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి ∙ చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి ∙ ఒక చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక నూడుల్స్, నువ్వులు, వెల్లుల్లి ముద్ద వేసి పదార్థాలన్నీ బంగారు రంగులోకి మారేవరకు కలిపి దింపేయాలి ∙ ఒక పెద్ద బౌల్లో నూడుల్స్ మిశ్రమం, క్యాబేజీ తరుగు వేసి కలపాలి ∙ ఫ్రిజ్‌లో నుంచి డ్రెసింగ్ మిశ్రమం బయటకు తీసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి, బాదం పప్పులతో అలంకరించి చల్లగా అందించాలి. త్రీ బీన్ సలాడ్ కావలసినవి: నానబెట్టిన అలసందలు – ఒక కప్పు ; నానబెట్టిన చిక్కుడు గింజలు; – ఒక కప్పు ; నానబెట్టిన సెనగలు – ఒక కప్పు ; ఉల్లి తరుగు – అర కప్పు ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు ; పంచదార – పావు కప్పు ; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు ; ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; నల్ల మిరియాలు – పావు టీ స్పూను; వెనిగర్ – 2 టీ స్పూన్లు తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మూడు రకాల గింజలూ వేసి బాగా కలపాలి ∙ కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙ వేరొక బౌల్లో వెనిగర్, పంచదార, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గింజలున్న బౌల్లో వేసి కలిపి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి, అందించాలి. సాల్మన్ ఎగ్ స్పెషల్ సలాడ్ కావలసినవి: సాల్మన్ చేప – 14 ముక్కలు (ఫోర్క్‌తో గాట్లు పెట్టి, నూనెలో వేయించాలి), ఉడికించిన కోడిగుడ్లు – 6 (పెంకు తీసి, కోడి గుడ్లను చిన్నచిన్న ముక్కులుగా చేయాలి), ఉల్లి తరుగు – అర కప్పు, ఆవాలు – ఒకటిన్నర స్పూన్లు (నీళ్లలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి), చీజ్ – అర కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూను, మిరప పొడి – పావు టీ స్పూను, ఉప్పు – తగినంత తయారీ: పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్లో వేసి బాగా కలిపి, మూత పెట్టి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి చల్లగా అందించాలి. చపాతీ నూడుల్స్ ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు నూడుల్స్‌కి బాగా అలవాటు పడ్డారు. మైదాతో తయారయ్యే నూడుల్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వాటికి బదులుగా చపాతీలతో నూడుల్స్‌లా చేసి పెడితే, మళ్లీ మళ్లీ కావాలంటారు. కావలసిన వస్తువులు: చపాతీలు – 3, ఉల్లిపాయ – 1, పచ్చి మిర్చి – 2, క్యారట్ – 1, బీన్స్ – 8, అజినమోటో– చిటికెడు, పంచదార – ఒక టీ స్పూను, మిరియాలపొడి – ఒక టీ స్పూను, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 4 టీ స్పూన్లు ∙ఉల్లిపాయలను సన్నగా తరగాలి ∙క్యారట్, బీన్స్‌లను సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ∙చపాతీలను కత్తెరతో సన్నగా నూడుల్స్‌లా కట్ చేయాలి ∙ప్యాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి ∙క్యారట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి ∙పంచదార, అజినమోటో జత చేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత కట్ చేసుకున్న చపాతీ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దింపేసి, కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి. మైదాపిండితో దుష్ప్రభావాలు ఫుడ్ ఫ్యాక్ట్స్ సాధారణంగా బిస్కెట్లు, బ్రెడ్, కేకులు వంటి బేకరీ ఉత్పత్తులలో మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కువగా తినే పిజ్జా, పేస్ట్రీలు, బర్గర్లు, పరాఠాలు, నాన్, స్వీట్స్ వంటి వాటిలో సైతం మైదా వాడకం ఎక్కువే. మైదాపిండిని గోధుమల నుంచే తయారుచేస్తారని తెలుసా! గోధుమ పిండిని సన్నటి జల్లెడలో జల్లించితే వచ్చేదే మైదా పిండి. ఇంత ఎక్కువగా జల్లించడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు పూర్తిగా బయటకుపోతాయి. జల్లెడ పట్టిన పిండిని బెంజైల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో బ్లీచింగ్ చేశాక, వచ్చిన మెత్తని పిండిని మైదాపిండిగా వాడుతుంటారు. ఇన్ని రకాలుగా ప్రోసెస్ చేయడం వల్ల ఈ పిండి మానవ ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుంది. చెడు ప్రభావాలు... మైదా పిండిలో అత్యధికంగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల ఈ పిండిని ఏ రూపంలో తిన్నా సుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి, పాంక్రియాస్‌పై ఒత్తిడి పడుతుంది. చివరకు ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. శరీరంలోని కొవ్వు శాతం పెరిగి, ఊబకాయులవుతారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. కోలన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మలబద్దకం కలుగుతుంది. ఇన్ని చెడు ప్రభావాలు కలిగించే మైదాను వాడటం అవసరమా అని ఆలోచించుకోవాలి. మైదాకు బదులుగా... మైదాకు బదులుగా జొన్న, రాగి, వరి... ధాన్యాల నుంచి తయారయ్యే పిండిని వాడటం మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాల్ పోస్టర్లు అతికించడానికి, బట్టలకు గంజి పెట్టడానికి ఉపయోగించే మైదాను రోజువారీ ఆహారంలో నుంచి తొలగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంటి చిట్కాలు ఉసిరి పచ్చడి నల్లబడకుండా ఉండాలంటే, పచ్చడిలో తగినంత నిమ్మరసం కలిపితే సరి ∙దోస ఆవకాయ ఘాటుగా అనిపిస్తే, కొద్దిగా నిమ్మరసం పిండితే, ఘాటు కొంతవరకు తగ్గుతుంది ∙టొమాటో పప్పు చప్పగా అనిపిస్తే, టీ స్పూను నిమ్మరసం జత చేస్తే రుచిగా ఉంటుంది. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. మీరు చేసిన భిన్నమైన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail : familyvantakalu@gmail.com సేకరణ: వైజయంతి -
డైటింగ్ కష్టంగా ఉందా?... అయినా బరువు తగ్గాలా?
రోజూ తప్పకుండా 4 లీటర్ల నీళ్లు తాగడం మరచిపోకండి. ఆహారానికి ముందు తప్పనిసరిగా సలాడ్ తీసుకోండి. అందులో జున్ను (చీజ్) లాంటివి లేకుండా చూసుకోవడం అవసరం. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ముఖ్యం. ఉదయం, మధ్యాహ్నం ఒక టేబుల్ స్పూను తేనె తీసుకోండి. -
ఆదాకు ఆలివ్ చిట్కా..
ఆదా, పొదుపు ఇవి సగటు జీవికే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలకూ చాలా కీలకమే. ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోగలమా అని కంపెనీలు నిరంతరం అన్వేషిస్తుంటాయి. పైసానే కదా అని చూసీ చూడనట్లుగా వదిలేయకుండా జాగ్రత్త పడి కోట్లు మిగుల్చుకుంటూ ఉంటాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఇదే చేసింది. ఆ కంపెనీ తమ ప్రయాణికులకిచ్చే సలాడ్‌లో ఆలివ్‌తో పాటు అయిదు వెరైటీలు ఉండేవి. ఇందుకోసం ప్రతి సలాడ్‌కి ఎనభై సెంట్లు ఖర్చయ్యేది. అయితే, చాలా మంది ఈ ఆలివ్‌ను తినకుండా వదిలేస్తుండటాన్ని గమనించి ప్రయోగాత్మకంగా సలాడ్‌లో నుంచి ఆలివ్‌ను తగ్గించారు. దీంతో సలాడ్ వ్యయం 33 శాతం మేర తగ్గి అరవై సెంట్లకి దిగొచ్చింది. ఈ రకంగా ఒకే ఒక్క ఆలివ్‌ను తగ్గించడం ద్వారా కంపెనీ ఏడాదికి 5,00,000 డాలర్లు (దాదాపు రూ. 3 కోట్లు) మిగుల్చుకుంది. అనవసర వ్యయాలు తగ్గించుకోవడానికి మిగతా వారు కూడా దీన్ని అమల్లో పెట్టొచ్చు. ఉదాహరణకు దుస్తులు మొదలు ఇంటి కొనుగోలు దాకా చాలా అంశాల్లో ఈ ఫార్ములా ప్రయత్నించవచ్చు. బాగుంది కదాని అవసరం లేకపోయినా అదనపు బెడ్రూం ఇల్లు తీసుకోకుండా ఉంటే ఆ మేరకు మిగుల్చుకున్నట్లే. అలాగని నిత్యావసరాలకు కూడా అన్వయించుకోకుండా వీలైన చోట్ల మాత్రమే ఇలాంటి ఆలివ్లను పక్కన పెడితే బోలెడంత ఆదా అయినట్లే.