అమెరికాలో ప్రాణాంతక బుబోనిక్‌ ప్లేగు వ్యాధి కలకలం

Rare Case Of Bubonic Plague In US First Since 2015 - Sakshi

అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి న‌మోదయ్యింది. అక్కడ ఓ వ్య‌క్తికి బుబోనిక్ ప్లేగు(Bubonic Plague) సోకిన‌ట్లు గుర్తించారు. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుంద‌ని భావిస్తున్నారు. బుబోనిక్ ప్లేగు వ‌ల్ల ఒక‌ప్పుడు యూరోప్‌లో భారీ న‌ష్టం జ‌రిగింది. మ‌ధ్య‌యుగంలో యూరోప్‌లో సోకిన ఆ ప్లేగు వ‌ల్ల సుమారు మూడ‌వ వంతు జ‌నాభా మృతి చెందింది. 

ఇప్పుడు మళ్లీ ఓరేగాన్‌లోని డిసెచూట్స్ కౌంటీలో తాజాగా అలాంటి కేసునే గుర్తించారు. అత‌నికి ట్రీట్మెంట్ ఇస్తున్నామ‌ని అధికారులు చెప్పారు. బాధితుడి స‌మీపంలో ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్య‌క్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా చికిత్స అందిస్తున్నట్లు డాక్ట‌ర్ రిచ‌ర్డ్ వాసెట్ తెలిపారు. అయితే ఈ వ్యాధి జంతువు లేదా ఈగకు సోకిన ఎనిమిది రోజుల తర్వాత మానువుల్లో ఈ ప్లేగు లక్షణాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 

దీని లక్షణాలు జ్వరం, వికారం, బలహీనత, చలి, కండరాల నొప్పులు తదితరాలు వస్తాయని అ‍న్నారు. ముందుగా రోగ నిర్థారణ చేయకపోతే గనుక ఈ వ్యాధి రక్తప్రవాహంలోకి వ్యాపించి అక్కడ నుంచి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి.. న్యూమోనిక్‌ ప్లేగుగా మారి పరిస్థితి విషమిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఇక్కడ అదృష్టవశాత్తు ముందుగానే ఈ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స అందించగలిగామని అన్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు.

సదరు వ్యక్తి ఉన్న ఒరెగాన్‌ ప్రాంతంలో అందుకు సంబంధించిన కేసులు ఏమీ నమోదు కాలేదన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధులు చాలా అరుదని చెబుతున్నారు. చివరిగా 2015లో దీనికి సంబంధించిన కేసు నమోదయ్యింది. ఎలుకలు, పెంపుడు జంతువుల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో ఐరోపాలో విలయం సృష్టించింది. నాటి సంక్షోభం కాల క్రమంలో ‘బ్లాక్ డెత్’ అన్న పేరు స్థిరపడింది. 

(చదవండి: హోలోగ్రామ్‌ వరుడు.. ప్రపంచంలోనే తొలి AI మ్యారేజ్‌!!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top