అనంత్‌-రాధిక పెళ్లి సందడి : జోరుగా సన్నాహాలు, లేజర్‌ లైట్‌ షో వైరల్‌

Radhika and Anant Ambani Wedding KrishnaThemed Laser Light Show - Sakshi

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీచిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్  పెళ్లి సందడికి సంబంధించి రోజుకో ముచ్చట వార్లల్లోనిలుస్తోంది. తాజాగా  గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో నిర్వహించిన లేజర్‌ లైట్‌ షో ఆకర్షణీయంగా నిలుస్తోంది. 

అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌తో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్‌,బిజినెస్‌ వర్గాల్లో ఎదురు చూస్తున్నాయి.  ఈ జంట జూలై 12న మూడుముళ్ల వేడకను నిర్వహించేందుకు ఇరుకుటుంబాలుఏర్పాటు ముమ్మరం చేశాయి. స్టార్-స్టడెడ్ ఈవెంట్‌కు ముందు  మార్చి 1- ఏప్రిల్ 2024 ప్రీ  వెడ్డింగ్‌ వేడులకు సన్నాహాలు ఊపందుకున్నాయి.

శ్రీకృష్ణుడి థీమ్‌తో లేజర్‌ లైట్‌షో

అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముందు అంబానీకుటుంబం  లేజర్ లైట్ షోను ఏర్పాటు చేసిందట.  శ్రీకృష్ణుడి థీమ్‌తో జామ్‌నగర్‌లో అందమైన లేజర్ లైట్ షోని విజువల్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తల్లీ కొడుకుల మధ్య అందమైన బంధాన్ని, పచ్చదనంలో తిరుగుతున్న ఏనుగును, నీలి ఆకుపచ్చ రంగులలో జామ్‌నగర్ మ్యాప్‌ను చూపించే దృశ్యాలు  విశేషంగా నిలుస్తున్నాయి. అంతేకాదు  వివాహానికి ముందు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో   14 కొత్త ఆలయాలను ప్రారంభించనున్నారు. 

అతిరథమహాథులు, ​‍ డ్రెస్‌కోడ్‌, గిఫ్ట్‌లు అలాగే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా అతిరథమహారథులు హాజరుకానున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ముఖేష్ అంబానీ ప్రముఖ అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారట.   ఖతార్ ప్రధాన మంత్రి, భూటాన్ రాజు ,రాణి సాహా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, బ్లాక్‌రాక్  సీఈవో లారీ ఫింక్, బ్లాక్‌స్టోన్ ఛైర్మన్, స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్, డిస్నీ CEO, బాబ్ ఇగర్,అడోబ్ సీఈఓ, శంతను నారాయణ్ లాంటి ప్రముఖులున్నారు. అలాగే అతిథులకు కూడా మూడు రోజులపాటు విభిన్న దుస్తుల కోడ్‌ ఉంటుంది.  దీంతోపాటు అతిథులకు బ్రహ్మాండమైన బహుమతులను కూడా ఇవ్వబోతున్నారట. 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top