చెట్టు నుంచి పుట్టిన శిశువు.. సరస్సు లోతును కనిపెట్టలేదట

Prashar Lake In Himachal Pradesh Mandi District Was Fresh Water Lake - Sakshi

రంగురంగుల స్కెచ్‌ పెన్నులు తెచ్చి ఎంతో పొందిగ్గా బొమ్మ గీసినట్లు ఉంటుంది ఈ ప్రదేశం. సొగసులొలిగే ప్రకృతి.. తనకు తానే దిష్టి చుక్క పెట్టుకున్నట్లు కనిపిస్తుంది ఈ ద్వీపం. దీని పేరు ప్రశార్‌ లేక్‌. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో 2,730 మీటర్ల ఎత్తులో ఉన్న మంచినీటి సరస్సు ఇది. మండి పట్టణానికి తూర్పున 49 కి.మీ దూరంలో ఉంది.

ఈ సరస్సు ఒడ్డున మూడు అంతస్తుల్లో ఆలయం ఉంటుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారట. ఒక చెట్టు నుంచి వచ్చిన శిశువు.. ఇక్కడ గుడి కట్టమని ఆదేశించిందని స్థల పురాణం. ఇంకో విషయమేంటంటే ఇప్పటి వరకు ఎవరూ ఈ సరస్సు లోతును కనిపెట్టలేదట. ఈ అందాలను ఆస్వాదించడానికి.. పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఒక్కో సీజన్‌లో ఒక్కో అందాన్ని అద్దుకునే ఈ సరస్సును జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే అంటుంటారు టూరిస్టులు. 

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top