ఇవాళే 'నేషనల్‌ హ్యాండ్‌ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!

National Hand Surgery Day: Symptoms And Causes Of RSIs In Hands - Sakshi

ఈ రోజే నేషనల్‌ హ్యాండ్‌ సర్జరీ డే. పనిచేసే చోటే చేతులకు ఎదురయ్యే సమస్యలు నిర్లక్క్ష్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ రోజుని ఏర్పాటు చేశారు. వర్క్‌ప్లేస్‌లో అదేపనిగా చేసే పనుల వల్ల చేతివేళ్లు, కండరాలకు ఎదురయ్యే అంతర్గత సమస్యల కారణంగా చేతులు నొప్పి పుట్టడం లేదా కదలించలేని స్థితికి వస్తుంది. చాలామంది అదే సర్దుకుంటుందని లక్క్ష్యపెట్టరు. దీంతో ఆ సమస్యలు తీవ్రమై సర్జరీ చేయించుకునే స్థితికి దారితీస్తుంది. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? దీనికి నివారణ తదితరాల గురించే ఈ కథనం.

కార్యాలయాల వద్ద చేసే పనిని బట్టి చేతులకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వుతాయి. కెమికల్స్‌కి సంబంధించిన వాటిలో పనిచేస్తే చేతులు చర్మానికి సంబంధించిన ఎలర్జీల బారినపడే అవకాశం ఉంటుంది. ఇక కంప్యూటర్‌ తదితర వాటి వద్ద పనిచేసే వాళ్ల అయితే ..అదే పనిగా టైప్‌ చేయడంతో పునరావృత ఒత్తిడితో కూడిన గాయాలు(ఆర్‌ఎస్‌ఐ) బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాయింట్‌ పెయిన్‌లు, లేదా వేళ్లు వద్ద కండరాలు దెబ్బతినడం లాంటివి. ఆ నొప్పి తీవ్రమైన ఛాతీ వరకు వ్యాపించటం జరుగుతుంది. చివరికి చేతిని పైకెత్తడం కాదుకదా! కనీసం కదపలేని స్థితికి వస్తారు. చాలమటుకు అందరూ వీటిని అలక్క్ష్యపెడతారు. పెద్ద సమస్యగా గుర్తించరు. పైగా తేలిగ్గా తీసుకుంటారు. అందుకోసమే ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ముఖ్యోద్దేశంతో ఈ నేషనల్‌ "హ్యాండ్‌ సర్జరీ డే" అనే దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా దీన్ని ఆగస్టు 23న జరుపుకుంటారు. 

ఈ గాయాలను ఎలా గుర్తించాలి
అదేపనిగా చేసే పనుల వల్ల చిటికెలు వద్ద కండరాలు రాపిడికి గురవ్వటం, లేదా జాయింట్లు తప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అవే కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ లేదా రేనాడ్స్‌ సిండ్రోమ్‌కి దారి తీస్తుంది. కటింగ్‌ పనులు చేసేవారికైతే తరచుగా లోతుగా అయ్యే గాయాలు మరింత తీవ్రమై రోజువారి జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. మనం కూర్చొనే తీరు, సమీపంలోని వస్తువులు, పరికరాల కారణంగా కూడా ఈ ఆర్‌ఎస్‌ఐ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పూణే రూబీ హాల్‌ క్లినిక్‌కి చెందిన ఆర్థోపెడిక్‌ అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ కిరణ్‌ ఖరత్‌​ తెలిపారు. 

పునరావుత ఒత్తడితో కూడిన గాయాలు(ఆర్‌ఎస్‌) లక్షణాలు..
చేతులు నొప్పి పుట్టడం లేదా ఒకవిధమైన జలధరింపుకు గురవ్వుతారు. కొందరిలో తిమ్మిర్లు వచ్చి అసౌకర్యంగా ఫీలవుతారు. మణికట్టు లేదా ముంజేయి నుంచి భుజం వరకు ఆ సమస్యలు పాకే అవకాశం ఉంది. దీన్ని ఆయా వ్యక్తుల శారరీకంగా చేసే శ్రమను పరిగణలోకి తీసుకుని నిర్థారిస్తారు. కొన్నిసార్లు నరాల్లో రక్తప్రసరణ సరిగా ఉందా లేదా అని నిర్వహించే పరీక్షలు లేదా అల్ట్రాసౌండ్‌ ఇమేజింగ్‌ వంటి రోగ నిర్థారణ పరీక్షల సాయంతో వైద్యులు ఈ సమస్యలను గుర్తిస్తారు. 

చికిత్స:

  • వర్క్‌ప్లేస్‌లో వాతావరణాన్ని ఒత్తిడి లేకుండా కూల్‌గా చేసేలా వాతావరణాన్ని సెట్‌ చేసుకోవాలి. అదేసమయంలో ఏకథాటిగా చేసే పనికి కాస్త విరామం ఇవ్వడం వంటివి చేయాలి. అలాగే ఒత్తిడికి గురికాకుండా మధ్య మధ్యలో తేలికపాటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆర్‌ఎస్‌ఐ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు లేదా సమస్య తీవ్రతను తగ్గించొచ్చు. 
  • ఈ ఆర్‌ఎస్‌ఐ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే కార్యాలయాల వద్ద ఉద్యోగులకు సౌకర్యావంతమైన రీతిలో ఫర్నేచర్‌, పరికరాలు, వంటివి ఉండాలే యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పని చేసే చోట ఎదురయ్యే అనుకోని ప్రమాదాలకు తక్కణ రక్షణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండాలి. 
  • వాటిన్నిటితో పాటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు దీని గురించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి. అందుకు తగ్గట్టు శిక్షణ సమావేశాలు ఏర్పాటు చేయడం, భద్రతో కూడిన పరికరాలు ఏర్పాటు, లేదా రక్షణ  కోసం చేతి తొడుగులు వంటివి ఏర్పాటు చేయాలని డాక్టర్‌ ఖరత్‌ అన్నారు. 

(చదవండి: వృద్ధులను వేదించే గొంతులోని కఫం సమస్యకు..ఇలా చెక్‌ పెట్టండి!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top