రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ! | Mukesh Ambani Gets Emotional During Anant Radhika Vidaai | Sakshi
Sakshi News home page

రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ!

Jul 15 2024 11:32 AM | Updated on Jul 15 2024 1:12 PM

Mukesh Ambani Gets Emotional During Anant Radhika Vidaai

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్‌ రాధికల వివాహం చాలా లగ్జరీయస్‌గా జరిగిన సంగతి తెలిసిందే. వివాహ తంతులో భాగంగా జరిగే అప్పగింతల కార్యక్రమం ఎంతటి ధనవంతురాలైన కోడలుగా వేరే ఇంట అడుగుపెట్టే వేళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఇక ఈ వివాహతంతు తర్వాత నవ వధువు తను పుట్టిన చోటును వెళ్లిపోతున్నానన్న ఆలోచన తట్టుకోలేకపోతుంది. అలాంటి భావోద్వేగ సమయంలో ఆమెను చూస్తున్న వాళ్లు సైతం కన్నీళ్లుపెట్టుకుంటారు. 

అలాంటి తంతే అనంత రాధికల వివాహానంతరం సాగింది. దీన్ని వాళ్లు విదాయి వేడుక అంటారు. కోడలు రాధికా మర్చంట్‌ విదాయి వేడుకలో భాగంగా తనవాళ్లకు వీడ్కోలు పలుకుతూ కన్నీళ్లుపెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి మామగారు ముఖేష్‌ అంబానీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సున్నితమైన ఘట్టంలో రాధిక కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అనంత్‌ ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా..ఆ తంతుని చూసి ముఖేష్‌ కూడా చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. 

ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  ఆయన తన కోడళ్లను చాలా ప్రేమానురాగాలో చూసుకుంటారు అనేందుకు ఈ ఘట్టమే ఉదాహరణ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఏ ఆడపిల్లకైన జీవితంలో తప్పక ఎదురై ఈ ఘట్టం కంటతడి పెట్టించేలా చేస్తుంది కదూ. 

 

(చదవండి: వింబుల్డన్ నేపథ్య చీరలో కంటెంట్‌ క్రియేటర్‌..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement