Multi Function Juicer: మల్టీఫంక్షన్‌ జ్యూసర్‌.. దీని ధర ఎంతంటే!

Kitchenware: Multi Function Juicer How It Works And Price Details - Sakshi

ఆరోగ్యాభిలాషులు మెచ్చే పాలలో సోయా పాలు ప్రత్యేకం. 350 ఎమ్‌ఎల్‌ సామర్థ్యం కలిగిన ఈ జ్యూసర్‌ చాలా వేగంగా సోయా మిల్క్‌ తయారుచేస్తుంది. స్మార్ట్‌ ప్యానల్‌ కలిగిన ఈ డివైజ్‌.. ఆరు వేరు వేరు మోడ్స్‌తో పని చేస్తుంది. టీ, హాట్‌ వాటర్, రైస్‌ పేస్ట్, స్టీమ్‌ కుక్, ఫ్రై వంటి ఎన్నో ఆప్షన్స్‌ ఇందులో ఉన్నాయి. స్టెయిన్‌ లెస్‌ లైనర్‌.. హై క్వాలిటీ ఫుడ్‌ గ్రేడ్‌ మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్‌లో చాలా రుచులను ఈజీగా సిద్ధం చేసుకోవచ్చు.

పని పూర్తి అయిన తర్వాత కొంత వాటర్‌ నింపుకుని.. క్లీనింగ్‌ బటన్‌ నొక్కితే చాలు  క్షణాల్లో శుభ్రమైపోతుంది. ఒకరు లేదా ఇద్దరికి సరిపడే ఆహారాన్ని ఇది వేగంగా కుక్‌ చేస్తుంది. ఇందులో న్యూట్రిషన్‌ మీల్స్, బేబీ మీల్స్‌ (పసిపిల్లల ఆహారం) తయారు చేసుకోవడం ఈజీ. పైగా దీని మూత జగ్‌ మాదిరి ఉండటంతో లోపల ఉన్న ద్రవాన్ని ఒలికిపోకుండా సర్వ్‌ చేసుకోవచ్చు. 
ధర : 71 డాలర్లు (రూ. 5,620) 
చదవండి: Kobbari Vadalu Recipe: రుచికరమైన కొబ్బరి వడల తయారీ ఇలా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top