ఈ ట్విన్స్ చిరుహాసానికి ద‌క్కిన ప‌దం.. 'షాయరీ ఆన్ స్నో'

Kashmiri Twin Sisters As 'Shayari On Snow' - Sakshi

చిన్నారుల వచ్చిరాని మాటలు భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. వారితో గడుపుతుంటే రోజులే తెలియవు. అలాంటిది చిన్నారులకు సంబంధించిన వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తాయి.  అమాయకత్వంతో కూడిన ఆ మాటలు వింటే ఎంతటి పెద్దవాళ్లైన చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. అంతలా ఆకట్టుకుంటాయి వారి మాటలు చేష్టలు. అందులోనూ ట్వీన్స్‌ అయితే మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అలాంటి  ట్విన్‌ సిస్టర్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. అందులో..

ఆరు సంవత్సరాల వయసు ఉన్న కశ్మీరి ట్విన్ స్విస్టర్స్ జైబా బింటీ తలిబ్, జైనబ్ బింటీ తలిబ్ వీడియో ఇంట‌ర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. కశ్మీర్‌లో ఫస్ట్ స్నోఫాల్‌ను సెలబ్రెట్ చేసుకోవడానికి సంబంధించిన వీడియో ఇది.

ఒకేరకం దుస్తులు ధరించి, మంచుతో నిండిన వీధిలో నిలబడి 'హమ్ యహా పే బహుత్ జాదా ఎంజాయ్ కర్ రహే హై. మస్తీ కర్ రహే హై' అంటూ పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న మాటలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర 'షాయరీ ఆన్ స్నో' కాప్ష‌న్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో పదకొండు మిలియన్లను దక్కించుకుంది.

ఇవి చ‌ద‌వండి: Pillala Katha: పాపన్న కొలువు!

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top