మోడల్‌ క్రేజ్‌.. ఫాలో అవుతోన్న బైడెన్‌

Joe Biden Following Model Chrissy Teigen POTUS On Twitter - Sakshi

ఐ వానా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ..

బైడెన్‌ ఫాలో అవుతన్న వారి సంఖ్య 13

12 మంది ప్రభుత్వ రంగ వ్యక్తులు, సంస్థలు

క్రిస్సీ ఒక్కరే నాన్‌ గవర్నమెంటల్

‘పోటస్‌’ ఫాలోవర్‌లు ఈ క్షణంలో 50 లక్షలా 70 వేలకు పైగానే. మరి కొత్తగా వచ్చిన బైడెన్‌ గారి ‘పోటస్‌’ ఎంతమందిని ఫాలో అవుతోంది? అంటే బైడెన్‌ ఎంతమందిని ఫాలో అవుతున్నారు? వచ్చీ రాగానే ఆయన పన్నెండు మందిని ఫాలో అయ్యారు! బైడెన్‌ ఫాలో అయింది ఒక్కరే అయినా బైడన్‌ కంటే వారు ఎంతో గ్రేట్‌ అనే. శుక్రవారం నాటికి బైడెన్‌ ఫాలో అయిన వాళ్ల సంఖ్య 13కు చేరింది. ఆ పదమూడు మంది ఎంతటివారో చూడండి. వైట్‌ హౌస్‌ కోవిడ్‌–19 రెస్పాన్స్‌ టీమ్, వైట్‌ హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్, వైట్‌ హౌస్‌ డొమెస్టిక్‌ పాలసీ అడ్వైజర్, వైట్‌ హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్, వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్, వైట్‌ హౌస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్, లాకాసాబ్లాంక్‌ (స్పానిష్‌ లాంగ్వేజ్‌ వైట్‌ హౌస్‌ అకౌంట్స్‌ సెక్షన్‌), వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ, సెకండ్‌ జెంటిల్మన్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ స్టేట్స్, యు.ఎస్‌. ఫస్ట్‌ లేడీ, యు.ఎస్‌. వైస్‌ ప్రెసిడెంట్, ది వైట్‌ హౌస్‌.. ఇంకొకరు క్రిస్సీ టైజెన్‌. ఆమె తప్ప మిగతా పన్నెండు మందీ గవర్నమెంట్‌లో ఉన్నవాళ్లు. లేదా గవర్నమెంట్‌ సంస్థలు. క్రిస్సీ ఒక్కరే నాన్‌ గవర్నమెంటల్‌! ఇంకా చెప్పాలంటే ఒక మోడల్‌. టీవీ యాంకర్‌. 78 ఏళ్ల బైడెన్‌ 35 ఏళ్ల క్రిస్సీని ఎందుకంత బహిరంగంగా ఐ వాన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ..’ అని అంటున్నట్లు! చెడు వినకండి. చెడు చూడకండి. చెడు మాట్లాడకండి.  

క్రిస్సీ అందంగా ఉంటారు. ఆమె భర్త జాన్‌ స్టీఫెన్‌. క్రిస్సీలా ఓ వంద పనులు చేస్తుంటారు ఆయన. సింగర్, సాంగ్‌ రైటర్, రికార్డ్‌ ప్రొడ్యూసర్, యాక్టర్, ఫిల్మ్‌ ప్రొడ్యూసర్, థియేటర్‌ డైరెక్టర్, ఫిలాంత్రొఫిస్ట్‌... ఉఫ్‌! క్రిస్సీ కూడా తక్కువగా ఏమీ ‘ఉఫ్‌’మనిపించరు. ఆడవాళ్లు అందంగా ఉంటే వాళ్ల టాలెంట్లన్నీ ఆ అందంలో కొట్టుకుని పోతాయి కనుక మనం కూడా ‘క్రిస్సీ అందంగా ఉంటారు’ అని మొదలు పెట్టినట్లున్నాం. ఆమె అమెరికన్‌ మోడల్, టీవీ పర్సనాలిటీ, ఆథర్, ఆంట్రప్రెన్యూర్‌.. ఇన్నున్నాయి! వీటికి తోడు హఠాత్తుగా ఇప్పుడు బైడెన్‌ పోటస్‌ ఫాలో అవుతున్నవాళ్లలో ఆమె పేరు!! 
(చదవండి: కొత్త అధ్యక్షుడు రాగానే.. పెద్ద డాక్టర్‌ మారిపోయాడు)

క్రిస్సీకి ముందే చెప్పకుండా పోటస్‌ ఆమెను ఫాలో అయింది. ఆ సంగతిని మొదట కనిపెట్టి తెల్లారేలోగా లోకానికి తెలియజెప్పింది గేబ్‌ ఫ్లెయిషర్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌. టీనేజ్‌ జర్నలిస్ట్‌ అతడు. అతడి పోస్ట్‌ చూసి, పోటస్‌ను ఓపెన్‌ చేసి ‘ఓ మై గాడ్‌’ అని అరిచేశారు క్రిస్సీ. అరిచేసి, తన పేరుతో ఉన్న బైడెన్‌ ఫాలోయింగ్‌ లిస్ట్‌ని స్క్రీన్‌ షాట్‌ తీసి తన వంతుగా ప్రపంచానికి పంచిపెట్టారు. 

బైడెన్‌కి ఏమిటంత క్రేజ్‌ క్రిస్సీ అంటే?! క్రేజ్‌ ఉందేమో మనకు తెలీదు. అది మనసు లోపల ఉండేది. బయటికైతే.. క్రిస్సీ పేరును తను ఫాలో అవుతున్న వారి లిస్టులో కూడా చేర్చకోవడంలో ఆయన పెద్దరికమే కనిపిస్తోంది. బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు బుధవారం క్రిస్సీ ఆయన్ని ఉద్దేశించి కొంటెగా ఒక ట్వీట్‌ పెట్టారు. ‘‘హల్లో జో బైడెన్‌.. ట్రంప్‌ నన్ను నాలుగేళ్లుగా బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. మీరు అన్‌ బ్లాక్‌ చేయగలరా ప్లీజ్‌’’ అని ఆ ట్వీట్‌. ఊరికే పెట్టారంతే. కానీ కొద్దిగంటల్లోనే ఆమె కొంటెతనం ఫలించి పోటస్‌లో ప్రతిఫలించింది. బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో క్రిస్సీ భర్త ‘సెలబ్రేటింగ్‌ అమెరికా’ అని ఒక మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఇచ్చారు.
(చదవండి: ఎంతో చేయాలి.. సమయమే లేదు)

ఆ ప్రభావం కూడా క్రిస్సీని ఫాలో అవడానికి బైడెన్‌ మీద కొంత పని చేసి ఉండొచ్చు. ఏమైనా, మరో అందగత్తెని పోటస్‌ ఫాలో అయ్యేవరకు క్రిస్సీనే మహారాణి. అవునూ.. ట్రంప్ఎందుకని క్రిస్సీని పోటస్‌లో బ్లాక్‌ చేసినట్లు! ఏం లేదు. అధ్యక్షుడిగా ఆయన ఛార్జి తీసుకోగానే ఆమె పెద్దగా నవ్వారు. ఆ నవ్వే ట్రంప్‌కి కోపం తెప్పించింది. ట్రంప్‌ ఏదో ట్వీట్‌ పెడితే దానికి స్పందిస్తూ.. ‘లాల్ల్‌.. నో వన్‌ లైక్స్‌ యు’ అని ట్వీట్‌ పెట్టారు. కోపం రాదా మరి?! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top