breaking news
Chrissy Teigen
-
మోడల్ క్రేజ్.. ఫాలో అవుతోన్న బైడెన్
‘పోటస్’ ఫాలోవర్లు ఈ క్షణంలో 50 లక్షలా 70 వేలకు పైగానే. మరి కొత్తగా వచ్చిన బైడెన్ గారి ‘పోటస్’ ఎంతమందిని ఫాలో అవుతోంది? అంటే బైడెన్ ఎంతమందిని ఫాలో అవుతున్నారు? వచ్చీ రాగానే ఆయన పన్నెండు మందిని ఫాలో అయ్యారు! బైడెన్ ఫాలో అయింది ఒక్కరే అయినా బైడన్ కంటే వారు ఎంతో గ్రేట్ అనే. శుక్రవారం నాటికి బైడెన్ ఫాలో అయిన వాళ్ల సంఖ్య 13కు చేరింది. ఆ పదమూడు మంది ఎంతటివారో చూడండి. వైట్ హౌస్ కోవిడ్–19 రెస్పాన్స్ టీమ్, వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్, వైట్ హౌస్ డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైట్ హౌస్ డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్, లాకాసాబ్లాంక్ (స్పానిష్ లాంగ్వేజ్ వైట్ హౌస్ అకౌంట్స్ సెక్షన్), వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ, సెకండ్ జెంటిల్మన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, యు.ఎస్. ఫస్ట్ లేడీ, యు.ఎస్. వైస్ ప్రెసిడెంట్, ది వైట్ హౌస్.. ఇంకొకరు క్రిస్సీ టైజెన్. ఆమె తప్ప మిగతా పన్నెండు మందీ గవర్నమెంట్లో ఉన్నవాళ్లు. లేదా గవర్నమెంట్ సంస్థలు. క్రిస్సీ ఒక్కరే నాన్ గవర్నమెంటల్! ఇంకా చెప్పాలంటే ఒక మోడల్. టీవీ యాంకర్. 78 ఏళ్ల బైడెన్ 35 ఏళ్ల క్రిస్సీని ఎందుకంత బహిరంగంగా ఐ వాన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ..’ అని అంటున్నట్లు! చెడు వినకండి. చెడు చూడకండి. చెడు మాట్లాడకండి. క్రిస్సీ అందంగా ఉంటారు. ఆమె భర్త జాన్ స్టీఫెన్. క్రిస్సీలా ఓ వంద పనులు చేస్తుంటారు ఆయన. సింగర్, సాంగ్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, యాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, థియేటర్ డైరెక్టర్, ఫిలాంత్రొఫిస్ట్... ఉఫ్! క్రిస్సీ కూడా తక్కువగా ఏమీ ‘ఉఫ్’మనిపించరు. ఆడవాళ్లు అందంగా ఉంటే వాళ్ల టాలెంట్లన్నీ ఆ అందంలో కొట్టుకుని పోతాయి కనుక మనం కూడా ‘క్రిస్సీ అందంగా ఉంటారు’ అని మొదలు పెట్టినట్లున్నాం. ఆమె అమెరికన్ మోడల్, టీవీ పర్సనాలిటీ, ఆథర్, ఆంట్రప్రెన్యూర్.. ఇన్నున్నాయి! వీటికి తోడు హఠాత్తుగా ఇప్పుడు బైడెన్ పోటస్ ఫాలో అవుతున్నవాళ్లలో ఆమె పేరు!! (చదవండి: కొత్త అధ్యక్షుడు రాగానే.. పెద్ద డాక్టర్ మారిపోయాడు) క్రిస్సీకి ముందే చెప్పకుండా పోటస్ ఆమెను ఫాలో అయింది. ఆ సంగతిని మొదట కనిపెట్టి తెల్లారేలోగా లోకానికి తెలియజెప్పింది గేబ్ ఫ్లెయిషర్ అనే ట్విట్టర్ యూజర్. టీనేజ్ జర్నలిస్ట్ అతడు. అతడి పోస్ట్ చూసి, పోటస్‌ను ఓపెన్ చేసి ‘ఓ మై గాడ్’ అని అరిచేశారు క్రిస్సీ. అరిచేసి, తన పేరుతో ఉన్న బైడెన్ ఫాలోయింగ్ లిస్ట్‌ని స్క్రీన్ షాట్ తీసి తన వంతుగా ప్రపంచానికి పంచిపెట్టారు. బైడెన్‌కి ఏమిటంత క్రేజ్ క్రిస్సీ అంటే?! క్రేజ్ ఉందేమో మనకు తెలీదు. అది మనసు లోపల ఉండేది. బయటికైతే.. క్రిస్సీ పేరును తను ఫాలో అవుతున్న వారి లిస్టులో కూడా చేర్చకోవడంలో ఆయన పెద్దరికమే కనిపిస్తోంది. బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు బుధవారం క్రిస్సీ ఆయన్ని ఉద్దేశించి కొంటెగా ఒక ట్వీట్ పెట్టారు. ‘‘హల్లో జో బైడెన్.. ట్రంప్ నన్ను నాలుగేళ్లుగా బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మీరు అన్ బ్లాక్ చేయగలరా ప్లీజ్’’ అని ఆ ట్వీట్. ఊరికే పెట్టారంతే. కానీ కొద్దిగంటల్లోనే ఆమె కొంటెతనం ఫలించి పోటస్‌లో ప్రతిఫలించింది. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో క్రిస్సీ భర్త ‘సెలబ్రేటింగ్ అమెరికా’ అని ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఇచ్చారు. (చదవండి: ఎంతో చేయాలి.. సమయమే లేదు) ఆ ప్రభావం కూడా క్రిస్సీని ఫాలో అవడానికి బైడెన్ మీద కొంత పని చేసి ఉండొచ్చు. ఏమైనా, మరో అందగత్తెని పోటస్ ఫాలో అయ్యేవరకు క్రిస్సీనే మహారాణి. అవునూ.. ట్రంప్ ఎందుకని క్రిస్సీని పోటస్‌లో బ్లాక్ చేసినట్లు! ఏం లేదు. అధ్యక్షుడిగా ఆయన ఛార్జి తీసుకోగానే ఆమె పెద్దగా నవ్వారు. ఆ నవ్వే ట్రంప్‌కి కోపం తెప్పించింది. ట్రంప్ ఏదో ట్వీట్ పెడితే దానికి స్పందిస్తూ.. ‘లాల్ల్.. నో వన్ లైక్స్ యు’ అని ట్వీట్ పెట్టారు. కోపం రాదా మరి?! -
క్రిసీకి ఆకలెక్కువ
మోడల్ క్రిసీ టీగన్ జీవితం అంటే ఆకలుండాలి. అలా ఉంటేనే జీవితం నిండుగా ఉంటుంది. టైమ్ మ్యాగజైన్ ఎంచుకున్న ఈ స్ఫూర్తిదాయకమైన మహిళ బయోగ్రఫీ చదివితే కడుపు నిండుతుంది... గుండె నిండుతుంది. మహిళలకు స్ఫూర్తినింపే వంటల పుస్తకం క్రిసీ. క్రిసీ టీగెన్... అమెరికన్ మోడల్... టీవీ హోస్ట్.. వీడియో సాంగ్స్ యాక్ట్రెస్... మంచి వంటల రచయిత్రి! దేనికీ జంకని వ్యక్తిత్వం! ముక్కుసూటిగా మాట్లాడే తత్వం! హాస్యచతురత ఆమె నైజం! తన కాస్మోటిక్ సర్జరీస్ గురించైనా... టెస్ట్‌ట్యూబ్ బేబీకి జన్మనివ్వడం సంగతైనా.. తను అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్, యాంగై్జటీ విషయం అయినా.. కాంప్లికేట్ అవుతున్న కాంట్రవర్సీస్ను కూడా ట్వీట్స్‌తో సింప్లిఫై చేసేస్తుంది. రెండు ముక్కల్లో ఆమెను వర్ణించాలంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్! ఆమె భర్త జాన్ లెజెండ్.. క్రిసీని ‘స్మార్ట్ మౌత్’ అని అభివర్ణిస్తాడు. క్రిసీని ఎరుగున్న ఆడపిల్ల ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటుంది! అందుకే టైమ్ మ్యాగజైన్ కూడా ప్రపంచంలోని 25 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో క్రిసీని చేర్చింది. నేపథ్యం.. క్రిసీ పుట్టిపెరిగింది అమెరికా ఉటా రాష్ట్రంలోని డేల్టాలో. తండ్రి రోన్. నార్వేజియన్ మూలాలున్నవాడు. తల్లి విలైలక్.. థాయ్‌ల్యాండ్ దేశస్తురాలు. క్రిసీ తండ్రి వ్యత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. పనికోసం తరుచుగా ప్రాంతాలు మారుతుండేవాడు. దాంతో హవాయ్, ఇడాహో, స్నోహోమిష్, వాషింగ్టన్లు తిరుగుతూ తిరుగుతూ క్రిస్సీకి యుక్తవయస్సు వచ్చేసరికల్లా కాలిఫోర్నియాలోని హంటింగ్టన్లో స్థిరపడ్డది ఆ కుటుంబం. వాండర్ లస్ట్‌ను తండ్రి నుంచి.. వంటలను తల్లి నుంచి ఒంటబట్టించుకుంది క్రిసీ. తల్లి వంటచేసేప్పుడు వంటింట్లో ఆమె వెనకాలే ఉంటూ గమనించేది. ప్రపంచమంతా తిరుగుతూ వెరైటీ వంటలను టేస్ట్ చేయడమే కాదు.. వండిపెట్టాలనేది ఆమె ఆశ, ఆశయం. గొప్ప షెఫ్ కావాలనే బాటలో చక్కటి గమ్యం దొరికే వరకు ఒక సూపర్మార్కెట్లో చిన్న ఉద్యోగం చేయసాగింది. అది ఆమె జీవితగమనాన్నే మార్చేసింది. సూపర్మార్కెట్లో ఉన్నప్పుడు స్టిల్ ఫోటోగ్రఫర్ ఒకరు క్రిసీని చూశాడు. ‘నువ్ ఉండాల్సింది ఇక్కడ కాదు’అన్నాడు ఆమెతో. ‘మరెక్కడా?’ ఎకసెక్కంగా అన్నది అతనితో. మోడల్‌గా న్యూయార్క్‌లో ఉండాలి అన్నాడు. పెదవులు విడవడకుండా నవ్వింది. ఆ హాసాన్ని అంగీకారంగా తీసుకొని ఫొటో షూట్‌కి ఏర్పాటు చేశాడు ఆ ఫొటోగ్రాఫర్. అప్పుడు ఆమెకు పాతికేళ్లు. క్రిసీ టీగెన్స్ హంగ్రీ... వంటల మీద పుస్తకం రాయాలన్న క్రిసీ కోరిక గర్భవతిగా ఉన్నప్పుడు తీరింది. ప్రతి రెసిపీని రుచి చూస్తూ ఎన్నో రకాల వంటలను పరిచయం చేస్తూ ‘క్రేవింగ్స్’ అనే పుస్తకం రాసింది. ఇది న్యూయార్క్ టైమ్ బెస్ట్‌సెల్లర్ అయింది. సెకండ్ వాల్యూమ్‌ను ల్యూనా పుట్టాక మొదలుపెట్టింది. అప్పటికే ఆమె పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో ఉంది. మొదటి పుస్తకాన్ని ఎంత ఆస్వాదిస్తూ రాసిందో.. రెండో పుస్తకాన్ని అంత యాంత్రికంగా రాసింది. ఈ విషయాన్నే గ్లామర్ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొంది. ‘ఫొటో షూట్ కోసం రెసిపీని ప్రిపేర్ చేస్తుంటే వామ్టింగ్ వచ్చేది – అని ఆ వ్యాసంలో రాసింది. తర్వాత ‘క్రిసీ టీగెన్స్ హంగ్రీ’ అనే వంటల చానల్ ప్రారంభించింది. ఎమ్‌టీవీ2లో ప్రసారమయ్యే ‘స్నాక్ ఆఫ్’ అనే కుకింగ్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రముఖ మోడల్ టైరా బాంక్స్ నిర్వహిస్తున్న ‘ఫాబ్ లైఫ్’ అనే లైఫ్ స్టయిల్ షోకి క్రిసీ ఫుడ్ స్టయిలిస్ట్‌గా ఉంటోంది. డీల్ ఆర్ నో డీల్... 2010లో మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ర్యాంప్ మీద క్యాట్‌వాక్ చేసింది. మాగ్జిమ్స్ క్యాలెండర్‌కి పోజ్ ఇచ్చింది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్, ఓషన్ డ్రైవ్, కాస్మోపాలిటన్, ఇటాలియన్ వోగ్, ఈస్క్వేర్, గ్లామర్ మ్యాగజైన్స్ క్రిసీ పోస్టర్‌ను తమ కవర్ మీద ముద్రించి సేల్స్‌ను పెంచుకున్నాయి. మోడల్‌గా బిజీ అయినా తన ప్యాషన్ అయిన కుకింగ్‌ను మరిచిపోలేదు. వంటల్లో సరికొత్త ప్రయోగాలకు పోపు పెడుతూనే ఉంది. ఇంకోవైపు ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేసే మోడల్‌గానూ చాన్స్ వచ్చింది. జిల్లెట్, ఓలే, నైకీ, స్కల్ క్యాండీ, గ్యాప్, యూజీజీ ఆస్ట్రేలియా, రాక్ అండ్ రిపబ్లిక్ వంటి బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసి ఆ ఉత్పత్తుల గిరాకీ పెంచింది. అనర్ఘళంగా మాట్లాడగలగడం, సమయస్ఫూర్తి, సెన్సాఫ్ హ్యూమర్.. కెమెరా ముందు తనకున్న ఈజ్.. క్రిసీని ఇంకో ద్వారం దగ్గర నిలబెట్టాయి. టీవీ షోస్‌ను ప్రెజెంట్ చేసే హోస్ట్‌ను చేశాయి. లెజెండ్ పరిచయం.. ప్రణయం.. పరిణయం 2007లో ప్రముఖ గాయకుడు, గేయ రచయిత జాన్ లెజండ్ రాసిన ‘స్టీరియో’ ఓ పాట వీడియో షూట్లో ఇద్దరు కలుసుకున్నారు. ఆ పాటలో క్రిసీ నటిస్తోంది. అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తన ప్రేమను క్రిసీకి చెప్పడానికి నాలుగేళ్లు పట్టింది అతనికి. 2011లో ఒక మంచి రోజు ‘లవ్ యూ’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు జాన్. డేటింగ్లో ఉన్నప్పుడు క్రిసీని ఖరీదైన హోటల్స్‌కి తీసుకెళ్లేవాడు జాన్. అతడికి ఖరీదైన డిన్నర్లు ఇవ్వడానికి తన పర్స్‌కు అంత సీన్ ఉండకపోయేది. చిన్న చిన్న రెస్టారెంట్స్‌కి తీసుకెళ్లేది. బిల్ పే చేస్తున్నప్పుడు.. ‘దేవుడా.. దేవుడా .. నా కార్డ్ డిక్లెయిన్ కావద్దు’ అంటూ దండం పెట్టుకునేది. ఆ క్లయిమాక్స్ సీన్కోసమూ జాన్ ఎదురు చూసేవాడు. చాలాసార్లు కార్డ్ డిక్లెయిన్ అయ్యేది.. వెనకనుంచి జాన్ వచ్చి బిల్ పేచేసి కళ్లెగరేసేవాడు. చేత్తో తల కొట్టుకుంటూ ఆయన భుజమ్మీద వాలిపోయేది. ఫేక్.. ఫేక్.. ఫేక్ నిజాలు ఎంతటి వివాదాలకు దారితీసినా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. మోడలింగ్‌లో టాప్లోఉన్నప్పుడే ఇదిగో మెరుస్తున్న ఈ నుదురు నిజం కాదు.. నా ముక్కూ ఒరిజినల్ కాదు.. ఈ పెదాలూ.. అంతకన్నా అబద్ధం.. అంతెందుకు.. నా మొహంలో బుగ్గలు తప్ప ఏవీ ఒరిజినల్ కావు.. అంతా కాస్మోటిక్ సర్జరీ మహిమే! నా చేతుల కింద ఉన్న కొవ్వును కూడా లైపో ద్వారా తీయించుకొని తీరైన ఆకృతిని తెచ్చుకున్నా. అయితే వీటిపట్ల నాకేం రిగ్రెట్స్ లేవు. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్’ అని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పేసింది. ప్రస్తుతం.. క్రిసీ కూతురు ల్యూనాకు యేడాది నిండింది. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్, యాంగై్జటీ నుంచి పూర్తిగా బయటపడింది క్రిసీ. బిడ్డతో పాటు పరుగులు పెట్టడానికి పోయిన శక్తిని కూడదీసుకుంటోంది. వాదాలు, వివాదాలు, సంచలనాలన్నిటికీ అదే చిరునవ్వుతో సమాధానం చెప్పింది. నిలబడింది. కాబట్టే టైమ్స్‌ని కదిలించగలిగింది. ఇన్స్పైరింగ్ ఉమన్‌గా కనిపించని క్రౌన్పెట్టుకుంది. బేబీ... వివాదం! పిల్లలంటే క్రిసీ, జాన్‌లకు ప్రాణం. రెండున్నరేళ్లయినా ఆ కలనెరవేరలేదు. క్రిసీ గర్భం దాల్చలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లారు దంపతులు. సహజరీతుల్లో క్రిసీ బిడ్డను కనే అవకాశంలేదు.. టెస్ట్‌ట్యూబ్ బేబీ ఒక్కటే మార్గం అని చెప్పారు. ఆ మార్గాన్ని అనుసరించక తప్పలేదు ఆ జంటకు. అలా 2016, ఏప్రిల్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది క్రిసీ. పాప పేరు ల్యూనా. ఆడపిల్లను కనడానికే టెస్ట్‌ట్యూబ్ బేబీ ఆప్షన్‌కు వెళ్లిందని, కావాలనే మగపిల్లడానికి వద్దనుకుందంటూ అర్థంపర్థంలేని ఎన్నో విమర్శలు బాలింత మీద ప్రభావం చూపాయి. క్రిసీ ఒక్కసారిగా కుంగిపోయింది. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అండ్ యాంగై్జటీతో బాధపడుతోందని చెప్పి యాంటి డిప్రెసెంట్స్ ఇచ్చారు. అప్పటి నుంచిక్రిసీలో చెప్పలేని మార్పు. మళ్లీ మొదటి క్రిసీలా తయారైంది. తల్లిగా పనికిరానేమో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉన్నా. ఒక రకంగా నేను ఎనర్జిటిక్ ప్రెగ్నెంట్‌ని. కడుపులో చిన్న బుద్ధుడు కాళ్లను ముడుచుకొని నా వీపు వైపు మొహం చేసుకొని పడుకున్నాడేమో అని ఫీల్ అయ్యేదాన్ని. సోనోగ్రామ్లో బిడ్డ పాదాలు, పిడికిళ్లు.. కనిపించేవి.. మొహం కనిపించేలోపు పక్కకు తిరిగిపోయేది. ఆ బుజ్జి మోము చూడ్డానికి తొమ్మిదినెలలు... ఉత్కంఠగా ఎదురుచూశా. డెలివరీ అప్పుడు లేబర్ రూమ్‌లో నాతోపాటు మా అమ్మ, జాన్ ఉన్నారు. జాన్ ‘సూపర్ఫ్లై’ పాటలోని డార్కెస్ట్ ఆఫ్ నైట్.. విత్ ద మూన్ షైనింగ్ బ్రైట్ అనే లిరిక్స్ హమ్ చేస్తుంటే పెయిన్స్ ఎక్కువయ్యేవి. తను పాడడం ఆపగానే పెయిన్స్ ఆగిపోయేవి. దాంతో డాక్టర్ జాన్‌ను పాడమని అడిగింది. పాట అయిపోయేలోపు ల్యూనా కేర్‌మంటూ డాక్టర్ చేతుల్లో పడింది. వెంటనే నాకు చూపించింది డాక్టర్. గుండ్రటి చిట్టి మొహం తనివితీరా చూసుకున్నా. బిడ్డను నా గుండెలకు హత్తుకొని నిద్రపోయాను. ట్యూనా పుట్టాక అవే నేను ఆస్వాదించిన ఆనంద క్షణాలు. – శరాది