Sakshi News home page

పది రూపాయలతో ప్రారంభం..

Published Wed, Mar 20 2024 1:56 PM

Inspiring Stories Of Indian Women - Sakshi

మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు...
మనతో ΄పాటు మన చుట్టూ 
ఉన్నవారూ బాగుండాలి
అనే ఆలోచన ఇండోర్‌వాసి కుక్కు ద్వివేదినిది.
ఆపదలో ఉన్నవారికి 
చిన్న సాయమైనా చేయాలి అనే ఆశయంతో  
బ్యాంకు ఉద్యోగం చేస్తూ, 
కుటుంబ నిర్వహణను చూస్తూనే 
పేదలకు కావల్సిన మందులను 
ఉచితంగా పంపిణీ 
చేయాలనుకుంది. అందుకోసం 
400 మంది సహోద్యోగుల జీతంలో 
ఒక్కొక్కరి నుంచి
పదేసి రూపాయలను సేకరించి, 
ఆ మొత్తంతో ఉచిత మందుల పంపిణీని 
మొదలుపెట్టింది. ΄పాతికేళ్లుగా 
సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 
బ్యాంకు ఉద్యోగం నుంచి 
వీఆర్‌ఎస్‌ తీసుకొని గ్రామాలు తిరుగుతూ 
ఉచిత విద్య, వైద్యసేవలను అందిస్తూ 
అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. 

‘‘నా బాల్యం అందమైన జ్ఞాపకాలతో గడిచింది. మా నాన్న డాక్టర్‌. నలుగురికి సాయం చేసే స్వభావం కావడంతో ఆయన సాయం కోసం, వైద్యం కోసం ఇంటికి ఎప్పుడూ అనేకమంది వస్తూ ఉండేవారు. వారి కోసం అమ్మ ప్రతిరోజూ వంట చేసి ఉంచేది. అది చూస్తూ పెరగడం వల్ల కాబోలు చిన్నప్పటి నుంచి ఎవరైనా సాయం అడిగితే కాదనే గుణం నాకు లేదు. ఇలా ఉచితంగా చేసే సాయాలను సామాజిక సేవ అంటారని కూడా తెలియకుండానే పదిమందికీ చేతనైన సాయం చేసేదాన్ని. 

జీవించడానికి తక్కువ వస్తువులు చాలు
డిగ్రీ పూర్తవుతూనే తొలి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఇతరులకు నా అంతట నేనే సాయం చేయగలిగే అవకాశం వచ్చిందని సంతోషించాను.పెళ్లయ్యాక నా భర్త మద్దతు లభించింది. నా భర్త కూడా బ్యాంకు ఉద్యోగి. ఇద్దరి సం΄ాదన ఉన్నా మా ఇంట్లో తక్కువ వస్తువుల వినియోగం ఉండేది. నిరాడంబరంగా జీవించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ఇంటి పరిసరాల్లోని అమ్మాయిల చదువుకు సాయం చేసేదాన్ని. 

పేదలకు అందని వైద్యం
ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నా కూతురు తీవ్ర అనారోగ్యానికి గురైంది. నా కుమార్తెకు చికిత్స జరుగుతున్నప్పుడు వైద్యం ఎంత ఖరీదైనదో తెలుసుకున్నాను. అంతటి ఖర్చు మేం ఎలాగో భరించగలిగాం. కానీ, రెండు పూటలా తిండికే నోచుకోని వారి సంగతేంటి? వారికి చికిత్స అవసరమైతే ఏం చేస్తారు? ఈ విషయం పదే పదే ఆలోచించేదాన్ని. ఒంటరిగా చేయడంలో పెద్ద సాయాన్ని అందివ్వలేనని గ్రహించాను. దీంతో నా సహోద్యోగుల సాయం తీసుకోవాలనుకున్నాను. 

పది  రూపాయలతో ప్రారంభం
మా బ్యాంకు యూనియన్‌ లీడర్‌కు ఈ విషయాన్ని చెప్పిన. ‘మా అందరికీ మంచి జీతం ఉంది. పేద ప్రజల కోసం ఏదైనా సహాయం చేయాలి’ అని వివరించాను. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఆలోచన ఇది. ప్రతి ఉద్యోగీ, తన జీతం నుంచి పది రూ΄ాయలను ‘సేవ’ కోసం కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా నెలకు నాలుగు వేల రూ΄ాయలు జమ అయ్యేవి. ΄పాతిక వేలు జమ కాగానే మా యూనియన్‌ లీడర్‌ ‘ఏం చేయాలో చెప్పమ’ని అడిగారు. 

హఠాత్పరిణామాలు
బ్యాంకు నిధులే కాకుండా విరాళం పేరుతో సాయం చేయడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. పదేళ్ల ΄ాటు ఈ విధమైన సేవాకార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నా భర్త హఠాత్తుగా చనిపోయాడు. దీంతో నేను చాలా రోజులు డిస్టర్బ్‌ అయ్యాను. ఆ రోజుల్లో మా సహోద్యోగులు కూడా మరింత సాయం అందించడానికి ముందుకు వచ్చారు. దీంతో రిలీఫ్‌ సొసైటీగా పేరు మార్చాం. ఎందుకంటే ఇందులో బయటి వ్యక్తులు చేరడం మొదలుపెట్టారు. రూ΄ాయ నుంచి లక్షల రూ΄ాయల విలువైన మందులు వస్తున్నాయి. 

పేదలకోసం ΄పాఠశాల
జబ్బులు వచ్చి, చికిత్సలో ఉన్న రోగులకు మందులు ఇవ్వడం ద్వారా సాయం చేస్తున్నాం. కానీ, జబ్బులు రాకుండా అవగాహన కల్పించాలంటే చదువు ఉండాలనుకున్నాం. సరైన చదువు ఉంటే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోగలరు. ఈ ఆలోచనతో సైన్యంలో వైద్య సేవలు అందించే మా స్నేహితురాలు డాక్టర్‌ అనురాధతో కలిసి గిరిజన పిల్లలకు చదువులు చెప్పడం ప్రారంభించడం. ఇండోర్‌కు మూడు గంటల ప్రయాణం దూరంలో ఉన్న ఖర్గోన్‌లో సంస్థకు ధర్మకర్తగా ఉంటూ అనురాధతో ΄పాటు కలిసి కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. అక్కడే 12 ఎకరాల్లో ΄పాఠశాల , హాస్టల్‌ కూడా నిర్మించాం. నా స్నేహితురాలి హఠాన్మరణంతో నేను బ్యాంకు ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకొని స్కూల్‌ బాధ్యతలు చూసుకోవడానికి వచ్చేశాను. 

మొదట ఎనిమిది, పది మంది పిల్లలతో పారంభించిన స్కూల్‌లో ఇప్పుడు 200 మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో 35 మంది వికలాంగులు. ఇప్పటికీ గ్రామంలో బాల్య వివాహాలు చేస్తుంటారు. దీంతో వారు చదువులు మానేసి వ్యవసాయం చేస్తుంటారు. పెద్దలకు అవగాహన కల్పించి, పిల్లలను స్కూల్‌కు తీసుకురావడం పెద్ద యుద్ధమే అవుతుంటుంది’ అంటూ తాము చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు ద్వివేదిని.
 

Advertisement

What’s your opinion

Advertisement