డిష్‌ వాష్‌బార్‌లతో చేతులు పాడవ్వుతున్నాయా..? | Home Tips: Does dish soap damage hands | Sakshi
Sakshi News home page

డిష్‌ వాష్‌బార్‌లతో చేతులు పాడవ్వుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..

May 28 2025 9:34 AM | Updated on May 28 2025 9:34 AM

Home Tips: Does dish soap damage hands

మార్కెట్లో దొరికే డిష్‌ వాష్‌బార్‌లు, లిక్విడ్‌లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్‌బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధ రకాల చర్మసమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్‌ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం...

  • వెనిగర్‌లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్‌ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి.

  • గంజినీళ్లలో బేకింగ్‌ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తొమితే మురికితోటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది.

  • బేకింగ్‌ సోడాలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో గిన్నెలు తోమితే మురికి వదలడమే గాక మంచి వాసన కూడా వస్తాయి.

గోరంత అందం..
గోళ్ల రంగుని శుభ్రంగా తొలగించి.. గోరువెచ్చని జొజోబా నూనెను గోళ్లమీద, చుట్టూ్ట ఉన్న చర్మంపైన వేసి గుండ్రంగా మర్దన చేయాలి. దీనివల్ల గోళ్లకు రక్త సరఫరా జరిగి చక్కగా పెరుగుతాయి. 

రాత్రి పడుకునే ముందు మర్ధన చేసి ఉదయం కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల గోళ్లు అందంగా పెరుగుతాయి. 

(చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement