Healthy Food Tips: Top 10 Vitamin D Rich Foods In Telugu, Check Here - Sakshi
Sakshi News home page

High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్‌, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్‌- డి పుష్కలం!

Jun 4 2022 10:10 AM | Updated on Jun 4 2022 10:54 AM

Health Tips In Telugu: Top 10 Vitamin D Rich Foods Check Here - Sakshi

మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్‌- డి కూడా ఒకటి. ఈ ‘సన్‌షైన్‌ విటమిన్‌’ లోపిస్తే ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది.  పిల్లల్లో రికెట్స్‌ వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ లోపాలను అధిగమించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సరి!  వీటిలో విటమిన్‌- డి పుష్కలం.

ఈ ఆహారాల్లో లభిస్తుందం’డి’
►పుట్టగొడుగుల్లో ‘విటమిన్‌–డి’ ఎక్కువగా ఉంటుంది.
►గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్‌–డి’ లభిస్తుంది.
►పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమద్ధిగా ఉంటాయి.
►ట్యూనా, సాల్మన్‌ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్‌–డి సమృద్ధిగా ఉంటుంది.
►జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్‌–డి’కి మంచి వనరులు.
►చలికాలంలో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత విటమిన్‌ డి లభిస్తుంది.
►అలాగని ఎండాకాలంలో ఎప్పుడూ ఏసీగదుల్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు శరీరానికి ఎండ తగలనివ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎండలోనే ఉందండీ మరి!

చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్‌- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్‌ ఉత్పత్తికి ఇది అవసరం!
Vitamin C Deficiency: విటమిన్‌ ‘సి’ లోపిస్తే జరిగేది ఇది.. ఇవి తింటే మేలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement