
వర్షాకాలం అనగానే భలే సరదాగా ఉంటుంది. చిరుజల్లుల్లో ఆహ్లాదభరితమైన వాతావరణం మనసు మెచ్చినా.. ఆరోగ్యపరంగా సమస్యాత్మకమే. ఈ కాలం వ్యాధులు ముసిరే కాలం. కాస్త తీసుకునే ఆహారంలో ఇలా మార్పులు చేసుకుంటే..ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారినపడకుండా ఉంటారని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు బాత్రా. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.
ఈ కాలంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అంత చురుగ్గా ఉండదు కాబట్టి తీసుకునే ఆహారంపై కాస్త ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణురాలు బాత్రా. మారే రుతుపవనాల దృష్ట్యా తీసుకునే డైట్‌లో మార్పులు తప్పనిసరి అని అంటున్నారు. ఈ వర్షాకాలంలోవ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంచే ప్రభావవంతమైన ఆహారాలను గురించి ఇన్‌స్టా వేదిక షేర్ చేశారు పోషకాహార నిపుణురాలు బాత్రా. తేలికగా జీర్ణమయ్యే ఈ తొమ్మిది ఆహారాలను తీసుకోమని చెబుతున్నారామె. అవేంటంటే..
మొదటగా తెల్ల బియ్యాన్ని నివారించి బదులుగా బ్లాక్ రైస్‌ను ఎంచుకోవాలని అన్నారామె. ఎందుకంటే ఇందులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి మెరుగా ఉండి, జీర్ణక్రియ గట్ ఆరోగ్యాన్ని ప్రభావవంతంగా ఉంచుతుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తుంది అని చెబుతోంది బాత్రఅందువల్ల నిరోధక పిండి పదార్ధాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు గట్ ఆరోగ్యాన్ని మందగించిన రుతుపవన జీవక్రియలో రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.
పచ్చి సలాడ్ కంటే మెత్తగా ఉడికించిన కూరగాయలను ఎంచుకోవాలట. ఎందుకంటే పచ్చి కూరగాయలు వర్షాకాలంలో పొట్ట ఉబ్బరాన్ని కలిగిస్తాయి. ఇక ఉడకబెట్టిన కూరగాయలు ప్రేగుకు ఉపశమనం కలిగించేలా మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.
వీధుల్లో అమ్మే తినుబండరాలు, చాట్ వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. బదులుగా ఆవితో ఉడికించిన మొలకెత్తిన మూంగ్ చాట్‌ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిలో ఎంజైమ్‌లు, ప్రోటీన్‌లలో అధికంగా ఉండటమే గాక ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.
ఈ కాలంలో తప్పనిసరిగా తులసి-అల్లం కషాయం వంటి వాటిని సేవించాలని సూచిస్తున్నారామె. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుందట.
ఈ కాలంలో ముడి ఆకుకూరలకు బదులుగా మోరింగ సూప్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనిలో ఐరన్, యాంటీమైక్రోబయాల్, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి అందువల్ల దీన్ని తీసుకుంటే బాడీ మంచి యాక్టివ్‌గా ఉండి జీర్ణ సమస్యలు దరిచేరవు.
ఈ కాలంలో మిగిలిపోయిన చద్దన్నం నివారించాలట. సాధ్యమైనంత వరకు తాజాగా వండిన భోజనం తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో నీటిలోనూ, చల్లటి పదార్థాల్లోనూ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అందువల్ల తాజాగా వేడిగా ఉండే ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే మంచిదని చెబుతోందామె.
అలాగే బేకరీ ఉత్పత్తులను నివారించి.. ఇంట్లో చేసిన ధోక్లా లేదా ఉడికించిన సెనగలు, స్వీట్‌కార్న్, చిలగడ దుంపలు వంటివి తీసుకోవాలని చెబుతోందామె.
అలాగే కట్‌చేసి నిల్వ ఉంచిన పండ్ల ముక్కలకు బదులుగా తాజాగా కడిగి కట్ చేసిన పండ్లను తినాలని సూచిస్తున్నారామె.
ఈ వర్షాకాలంలో వేడిగా పొగలతో కూడిన ఆహారంత తీసుకుంటేనే మంచిది. ఇది రుచికరంగానే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి, మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. లేదంటే చల్లటి ఆహారాలు జీర్ణ సమస్యలు, పలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు బాత్రా.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.
(చదవండి: