అముదం నూనెతో అద్భుత ప్ర‌యోజ‌నాలు | health And Skin Benefits With Castor Oil | Sakshi
Sakshi News home page

అముదం నూనెతో అద్భుత ప్ర‌యోజ‌నాలు

Sep 4 2020 4:54 PM | Updated on Sep 4 2020 5:09 PM

health And Skin Benefits With Castor Oil - Sakshi

కాస్టర్ ఆయిల్(ఆముదం నూనె).. ఆముదం చెట్టు గింజ‌ల నుంచి ల‌భించే ఈ నూనె ఎన్నో స‌మ‌స్య‌ల‌కు నివార‌ణిగా ప‌నిచేస్తోంది. చర్మంతో పాటు జుట్టుకు సంబంధించిన అనేక రకరకాల సమస్యల‌ను దూరం చేయ‌డంలో ఆముదం పాత్ర అగ్ర‌స్థానం. మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అందమైన శరీరానికి దోహదం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు బాగా పనిచేస్తాయి. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. (అందానికి తెలుపు అవసరం లేదు)

తేమను పునరుద్ధరిస్తుంది: ఆముదం నూపె స‌హ‌జ‌మైన తేమ‌ను క‌లిగి ఉంటుంది. ఇది గాలి నుంచి తేమను చర్మంలోకి లాగగలదు, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది చర్మం బయటి పొర ద్వారా తేమను నిలుపుకుంటుంది. ఆముదం నూనెలో ఉండే అధిక స్నిగ్ధత కారణంగా ఈ నూనె కొద్దిగా చిక్కగా ఉండి ఒక రకమైన వాసన వస్తుంటుంది. అయితే ఇది చ‌ర్మం మీద మంద‌పాటి పొర‌ను ఏర్ప‌ర‌చి, తేమ‌ను లాక్ చేస్తుంది. మీద చర్మంపై మందపాటి, రక్షిత పొరను ఏర్పరుస్తుంది. దీని ద్వారా డ‌స్ట్ చ‌ర్మ‌లోప‌లి పొర‌ల్లోకి వెళ్ల‌కుండా అడ్డ‌కుంటుంది. (బెల్లీ ఫ్యాట్ త‌గ్గ‌డానికి ఈ ఒక్క‌టి చేస్తే చాలు)

మొటిమలతో పోరాడుతుంది: ఆముదం నూనె యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది, మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా ఉండేందుకు, లేదా త‌గ్గించేందుకు  పనిచేస్తుంది.

జుట్టు రాలడం అరికడుతుంది: ఆముదం నూనె జుట్టు రాలడాన్ని అరికట్టి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో బెస్ట్ హోం రెమెడీ . ఉత్తమ ఫలితాలను పొందడానికి వారానికొకసారి ఆముదంను తలకు పట్టించాలి.జుట్టు బాగా రాలుతున్నప్పుడు ఇలా చేయొచ్చు... నాలుగు చెంచాల చొప్పున కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గుడ్డులోని తెల్ల సొన కలిపి... తలకు పూతలా వేసుకోవాలి. ఓ గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే....జుట్టు రాలకుండా ఉంటుంది.

చర్మం ముడ‌త నుంచి కాపాడుతుంది: ఆముదం నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది. మృదువుగా మారుతుంది. ముడ‌త‌ల‌ను నివారిస్తుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది. (ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమేమే)

జుట్టు పెరుగుద‌ల‌కు దోహదం చేస్తుంది : ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఇది తలలో పిహెచ్ లెవల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోకుండా సహాయపడుతుంది. డల్ మరియు డ్యామేజ్ హెయిర్‌ను నివారించడంలో ఇది ప్ర‌ముఖ పాత్రం పోషిస్తుంది. ఆముదం నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుకు నేచురల్ షైనింగ్, స్ట్రాంగ్ నెస్‌ను అందిస్తుంది. అందువల్లే, ఆముదం నూనె అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోగలుగుతుంది. 

ఆముదంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. మన శరీరంలో పలు హార్మోన్లు సక్రమంగా పనిచేయాలంటే అందుకు కొవ్వు పదార్థాలు సరిగ్గా జీర్ణం కావాలి. అయితే ఆముదాన్ని సేవిస్తే ఆ కొవ్వు పదార్థాలు శరీరంలో బాగా ఇమిడిపోతాయి. దీంతో హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. 

ఇదిలా ఉండ‌గా.. ఆముదం ఎన్ని మంచి గుణాల‌నుక‌లిగి ఉన్న‌ప్ప‌టికీ అంద‌రికీ స‌రిపోదు. కొంద‌రికి మంచి ఫ‌లితాల‌ను ఇచ్చిప్ప‌టికీ అందిరిపై ఒకే ప్రభావాన్ని చూపించ‌దు. కొంత‌మందికి ఎల‌ర్జీని తెచ్చిపెడుతుంది. ఆముదము నూనె మందంగా ఉండ‌టం వ‌ల్ల‌ కొన్ని సంద‌ర్భాల్లో మొటిమ‌ల‌కు కార‌ణం అవుతుంది. మొఖంపై జిడ్డు చేరి ఆక‌ర్ష‌ణ త‌గ్గుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement