Sonali Bendre: సోనాలీ బింద్రే ధరించిన ఈ త్రీ పీస్‌ డ్రెస్‌ ధర 78 వేల పైమాటే! స్పెషాలిటీ?

Fashion: Sonali Bendre In Chandrima Label Lehenga Cost Leaves You Shock - Sakshi

అందంగా కనిపించాలనుకోవడం హాని కాదు: సోనాలీ బింద్రే

‘అలనాటి రామచంద్రుడి’ అంటూ సీతలా సిగ్గుల మొగ్గ అయిన సోనాలీ బింద్రే ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇన్నేళ్లయినా ఇప్పటికీ అదే గ్రేస్‌ను మెయిన్‌టైన్‌ చేస్తోంది. ఆ క్రెడిట్‌ అంతా ఈ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌దే! 

చంద్రిమా..
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ.. ముంబైలో  ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది చంద్రిమా అగ్నిహోత్రి. అబూ జానీ, సందీప్‌ ఖోస్లా, రోహిత్‌ బాల్‌ వంటి ప్రముఖ డిజైనర్ల దగ్గర  పనిచేసిన తర్వాత,  2019లో  సొంత లేబుల్‌ ‘చంద్రిమా’ను  ప్రారంభించింది.

చేనేత, హస్తకళల సమ్మేళనంతో వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. ష్యాషన్‌ డిజైనింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటోంది. అందుకే వీటి ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆన్‌లైన్‌లో లభ్యం.

లారా మొరాఖియా... 
మలబార్‌ ప్రాంతంలో  పుట్టి పెరిగిన లారాకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తి.  2018లో తన పేరుతోనే  ‘లారా మొరాఖియా’ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ దేశ పురాతన కళాకళాఖండాల డిజైన్స్‌నే ప్రేరణగా.. స్ఫూర్తిగా తీసుకుని వెండి , బంగారు లోహాల్లో ముత్యాలు, వజ్రాలను పొదుగుతూ అందమైన  ఆభరణాలను అందిస్తోంది.

ఈ నగలకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ డిమాండ్‌ ఎక్కువే. ఈ బ్రాండ్‌కు  ప్రస్తుతం న్యూయార్క్, ముంబైలో మాత్రమే స్టోర్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వీలుంది.

హానికారకం కాదుకదా!
‘నచ్చి చేసే తప్పుల్లో నాకు నచ్చేది అందంగా కనిపించాలనే ఆలోచన’ అని హాలీవుడ్‌ స్టార్‌ అల్‌పచీనో అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? అందంగా కనిపించాలనుకోవడమేమీ హానికారకం కాదుకదా! కాకపోతే మనకేది నప్పుతుందో చూసుకోవడం కూడా ముఖ్యమే.  – సోనాలీ బింద్రే

బ్రాండ్‌ వాల్యూ
జ్యూయెలరీ
బ్రాండ్‌: లారా మొరాఖియా
ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.

డ్రెస్‌: త్రీ పీస్‌ సెట్‌
బ్రాండ్‌: చంద్రిమా
ధర: లెహంగా: రూ. 39,990
టాప్‌: రూ. 6,990
జాకెట్‌: రూ. 31,990 
-దీపిక కొండి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top