ఎంటర్‌ప్రెన్యూర్‌ కమ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన లాయర్‌! ఏకంగా ఆరుసార్లు కేన్స్‌..! | Entrepreneur Diipa Buller Khosla Glamorous Appearance At Cannes 2024 | Sakshi
Sakshi News home page

ఎంటర్‌ప్రెన్యూర్‌ కమ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన లాయర్‌! ఏకంగా ఆరుసార్లు కేన్స్‌..!

May 23 2024 6:50 PM | Updated on May 23 2024 7:05 PM

Entrepreneur Diipa Buller Khosla Glamorous Appearance At Cannes 2024

ఓ మహిళ ఒక తల్లిగా, వ్యాపారవేత్తగా, మోడల్‌గా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. లాయర్‌ నేపథ్యం నుంచి పూర్తి విరుద్ధ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంతేగాదు ఫ్రాన్స్‌ వేదికగా జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో అద్భుతమైన డిజైనర్‌ డ్రెస్‌లో మెరిసింది. ఇంతకీ ఎవరంటే ఆమె..

దక్షిణాసియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, మహిళా వ్యాపార వేత్త అయిన దీపా బుల్లెర్‌ ఖోస్లా శక్తిమంతమైన మహిళ. విభిన్న రంగాల్లో దూసుకుపోతూ కూడా ఓ తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆమె కంటెంట్‌​ క్రియేటర్‌గా, సామాజకి కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తూనే వ్యాపార రంగంలో ప్రభంజనం సృష్టిస్తోంది. అంతేగాదు ముంబై ఆమ్‌స్టర్‌డామ్‌ ఆధారిత ఎంటర్‌ప్రెనూర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ని కలిగి ఉంది. 

మరోవైపు అందం, ఫ్యాషన్‌కి సంబంధించిన వ్యాపార రంగాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇక ఫ్రాన్స్‌లో అట్టహాసంగా  జరుగుతున​ 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ప్రఖ్యాత డిజైనర్‌ వాల్డ్రిన​ షైతీ షెల్ఫ్‌ రూపొందించిన మెటాలిక్‌ స్ట్రక్చర్డ్‌ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆమె డిజైనర్‌ డ్రెస్‌ ముందుభాగంలో ఉన్న లోహ గులాబీ హైలెట్‌గా నిలిచింది. అందుకు తగ్గట్లుగా బాబ్‌ స్టైల్‌ హెయిర్‌ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి ఆమెకు. 

ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ ఈవెంట్‌లో తన అత్యాధుని ఫ్యాషన్‌ డిజైనర్‌వేర్‌ డ్రెస్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలకు  ‌"బ్యాక్ ఎట్ ది కార్పెట్ అట్ ఆల్ స్టార్ట్... హోమ్‌కమింగ్ @festivaldecannes" అనే క్యాప్షన్‌ తోపాటు హార్ట్‌ ఎమోజీని జోడించి మరీ ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. ఐతే ఆమె ఈ కేన్స్‌ ఈవెంట్‌లో గత ఆరేళ్లుగా పాల్గొంటుందట. 

ఆమె నేపథ్యం..
దక్షిణాసియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ తన పాఠశాల విద్యను ఊటీలో పూర్తి చేసింది. తల్లి డాక్టర్‌ కావడంతో తాను కూడా అదే వృత్తిలో ఉండాలనుకుంది. ఐతే ఇంటర్నషిప్‌లో తన ఆలోచనను మార్చుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి అయిన వెంటనే నెదర్లాండ్స్‌ ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టోలో న్యాయవాదిగా పనిచేసింది. తదనంతరం లండన్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు, ఐఎంఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఏజెన్సీలో ఇంటర్న్‌షిప్‌ చేసింది. అయితే ఎంతోకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగలేదు. 

మళ్లీ డిజట్‌ కంటెంట్‌ క్రియెటర్‌గా కెరీర్‌గా ఎంచుకుని మరీ దూసుకుపోయింది. ఇక 2022లో తన బ్యూటీ బ్రాండ్‌ ఇండెవైల్డ్‌ను ప్రారంభించింది. తన తల్లి నుంచి ప్రేరణ పొందిన ఆయుర్వేదం బ్రాండ్‌లో పాతుకుపోయింది. చర్మ రక్షణలో ప్రామాణిక ఉత్పత్తులే బెటర్‌ అని భావించి ఇటువైపు దృష్టి సారించి వ్యాపారవేత్తగా మారింది. 32 ఏళ్ల దీపా తన భర్త డచ్‌ దౌత్యవేత్త ఒలేగ్‌ బుల్లెర్‌తో కలిసి లాభప్రేక్షలేని పోస్ట్‌ ఫర్‌ చేంజ్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది లింగ సమానత్వంపై యూఎస్‌ UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు సోషల్‌ మీడియా శక్తిని వినియోగించుకుంటుంది. 

ఇన్ని రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉన్న కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ముఖ్యంగా దీపాకి నాలుగేళ్ల కూతురు దువాతో స్పెండ్‌ చేయడం మహా ఇష్టం. "సహనానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రతీది వెంటనే చేయనవసరం లేదని, అలా అని ప్రతి అడుగు వెనక్కి వేసి బ్రేక్‌ తీసుకోవడం కూడా సరైనది కాదు" అంటుంది దీపా. తన కలలన్నింటిని సాకారం చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోవతూ.. ఎందరో మహిళా పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచింది దీపా బుల్లెర్‌ ఖోస్లా .

 

(చదవండి: 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement